Actress Sangeetha Comments About Her Husband In Latest Interview - Sakshi
Sakshi News home page

Sangeetha: నేను రాక్షసిని.. నా భర్త క్రిష్ మాత్రం..!

Jul 13 2023 4:58 PM | Updated on Jul 13 2023 5:10 PM

Actress Sangeetha Comments Latest Interview - Sakshi

నటి సంగీత గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పేదేం లేదు. అప్పుడెప్పుడో 'ఖడ్గం' నుంచి స్టిల్ ఇప్పటికీ సినిమాల‍్లో నటిస్తూనే ఉంది. పెళ్లాం ఊరెళితే, ఆయుధం, ఖుషీఖుషీగా, సంక్రాంతి తదితర చిత్రాలు ఈమెకు బోలెడంత ఫేమ్ తెచ్చిపెట్టాయి. 2010 తర్వాత దాదాపు పదేళ్లపాటు టాలీవుడ్‌కు దూరమైన సంగీత.. 'సరిలేరు నీకెవ్వరు'తో రీఎంట్రీ ఇచ్చింది. ప్రస‍్తుతం తెలుగు-తమిళంలో సినిమాలు చేస్తున్న ఈమె.. తన పెళ్లి జీవితంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. 

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 19 మూవీస్)

తొందరపడ్డామా అనిపించింది
'పెళ్లి చేసుకున్న తర్వాత మొదట్లో ఈ లైఫ్ అంటేనే చిరాకేసింది. దీని నుంచి బయటపడాలని ప్రయత్నించాను. త్వరగా ఈ మ్యారేజ్ లైఫ్‌ని వదిలేయాలనుకున్నాను. ఎందుకంటే మొదట్లో పరిస్థితులు అంత దారుణంగా ఉండేవి. మేం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మా ఆయన ఫ్యామిలీ నుంచి ఒత్తిడి, మా ఇంట్లో గొడవలు జరిగాయి. దీంతో వాళ్లకు దూరమైపోయాం. తొందరపడి పెళ్లి చేసుకున్నామా అనే డౌట్ వచ్చింది'

అర్థం చేసుకున్నాం
'తెలిసో తెలియకో ఓ నిర్ణయం తీసుకున్నాను. అది తప్పా ఒప్పా అనేది నాకు తెలియదు. కానీ కరెక్ట్ చేయాల్సిన బాధ్యత మాత్రం నాపైనే ఉంది. దీన్ని పరిష్కరించాలా? దీని నుంచి బయటకొచ్చేయాలా? నా ముందు రెండే ఆప్షన్స్ కనిపించాయి. అప్పట్లో మా ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికి పెద్దగా తెలియదు. ముందు దానిపై వర్క్ చేశాం. ఒకరినొకరు అర్థం చేసుకుని, బాగా నమ్మకం ఏర్పరుచుకున్నాం'

(ఇదీ చదవండి: పెళ్లిపై విజయ్ దేవరకొండ కామెంట్స్.. తను కూడా!)

వదిలేద్దామనుకున్నా
'ఇద‍్దరం ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఆలోచనలు, మనస్తత్వాలు, చేసే పనులు అన్నీ మా విషయంలో డిఫరెంట్. దీనిపై వర్క్ చేసి అర్థం చేసుకున్నాం. క్రిష్(సంగీత భర్త) అమేజింగ్ పర‍్సన్. నన్ను వదులుకోవడం తనకు అస్సలు ఇష్టం లేదు. నేను చాలాసార్లు ఆయన్ని వదిలేద్దామనుకున్నాను. కానీ.. 'అలా చేయొద్దు. జీవితం చాలా చిన్నది. ఇష్టమైన వాళ్లు కొందరే ఉంటారు. వారిని అస్సలు వదులుకోవద్దు' అని నన్ను మోటివేట్ చేశాడు'

నాపై చాలా ప్రేమ
'క్రిష్ తో పోలిస్తే నేను ఓ రకమైన రాక్షసిని. నేను ఏది అనుకుంటే అది జరగాలని ఫిక్సవుతాను. తను మాత‍్రం నాకోసం ఏదైనా చేస్తాడు. అందుకే పెళ్లి జీవితాన్ని కంటిన్యూ చేస్తున్నాను. తను నన్ను చాలా ప్రేమిస్తాడు. చాలా కమాండ్ ఉన్న వ్యక్తి కూడా' అని సంగీత చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ నటి తన పెళ‍్లి జీవితంపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

(ఇదీ చదవండి: ఆ హీరోయిన్‌కి పవన్ కాస్ట్ లీ గిఫ్ట్.. దాంతో పాటు!)

Advertisement
 
Advertisement
Advertisement