Vijay Deverakonda marriage comments in light of 'Aradhya' song from 'Kushi' - Sakshi
Sakshi News home page

Vijay Devarakonda: పెళ్లి తర్వాత నేను ఇలానే ఉండాలనుకుంటున్నా

Jul 13 2023 2:46 PM | Updated on Jul 13 2023 3:01 PM

Vijay Devarakonda Marriage Comments Kushi Song - Sakshi

రౌడీ హీరో విజయ్ దేవరకొండ పెళ‍్లిపై కామెంట్స్ చేశాడు. ఇది చేసుకున్న తర్వాత ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో బయటపెట్టాడు. రౌడీ హీరో ప్రస్తుతం 'ఖుషి' సినిమా చేస్తున్నాడు. ఇందులో విజయ్-సమంత భార్యభర్తలుగా నటిస్తున్నారు. తాజాగా విడుదలైన ఓ సాంగ్ లో వీళ్లిద్దరూ నెక్స్ట్ లెవల్ కెమిస్ట్రీ పండించారు. దీంతో విజయ్ కామెంట్స్ వైరల్ అయ్యాయి.

(ఇదీ చదవండి: 'ఖుషి' కొత్త సాంగ్.. సమంతకి కొత్త తలనొప్పి!)

నాది కూడా ఇలానే
''ఖుషి'లోని నాకు ఇష్టమైన పాటల్లో 'ఆరాధ్య' ఒకటి. పెళ్లి చేసుకున్న తర్వాత ఏడాది పాటు ఆ దంపతులు ఎలా ఉంటారో ఇందులో చూపించారు. ఎంతో బ్యూటిఫుల్‪‌గా సాగే ఈ సాంగ్‌లో భార్యభర్తల మధ్య ఉండే అనుబంధాన్ని అందంగా చూపించారు. నేను ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు గానీ ఫ్యూచర్ లో నా పెళ్లి లైఫ్ ఈ పాటలో ఉన్నట్లే ఉండాలని కోరుకుంటున్నాను' అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. 

రష్మికతో విజయ్?
గతంలో చాలా సందర‍్భాల్లో విజయ్-రష్మిక మధ్య పెళ్లి చేసుకుంటారని అన్నారు. ఎందుకంటే వీళ్లిద్దరూ 'గీతగోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాలు కలిసి చేశారు. అద్భుతమైన కెమిస్ట్రీ పండించారు. దీంతో వీళ్లిద్దరూ మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అనే రూమర్స్ వచ్చాయి. అయితే తాము కేవలం స్నేహితులం అని క్లారిటీ ఇవ్వడంతో అంత సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు మళ్లీ విజయ్ పెళ్లిపై కామెంట్స్ చేయడంతో రష్మిక ఫ్యాన్స్ అలెర్ట్ అయిపోయారు.  

(ఇదీ చదవండి: చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. కేసు నమోదు చేసిన పోలీసులు!)

Advertisement
 
Advertisement
Advertisement