పాన్‌ వరల్డ్‌ హీరోయిన్‌ రీఎంట్రీ.. | Actress Ramba Reentry For Movies | Sakshi
Sakshi News home page

పాన్‌ వరల్డ్‌ హీరోయిన్‌ రీఎంట్రీ..

Jun 7 2025 2:33 PM | Updated on Jun 7 2025 4:01 PM

Actress Ramba Reentry For Movies

మలయాళంలో హీరోయిన్‌గా  రంగప్రవేశం చేసి, టాలీవుడ్, కోలీవుడ్‌లను దాటి ఉత్తరాది భాషల్లోనూ తన కంటూ స్టార్‌ ఇమేజ్‌ను సంపాదించుకున్న తెలుగింటి ఆడపడుచు రంభ. సర్గం (1992) అనే మలయాళ చిత్రం ద్వారా కథానాయకిగా రంగప్రవేశం చేసిన ఈ బ్యూటీ  అదే ఏడాదిలో  తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చేశారు. ఆపై తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, బెంగాలీ, బోజ్‌పురి, ఆంగ్లం మొదలగు 8 భాషల్లో నటించి అప్పట్లోనే పాన్‌ వరల్డ్‌ కథానాయకిగా వెలిగారు. 

అలా రెండు దశాబ్దాలకు పైగా అగ్ర కథానాయకిగా రాణించిన రంభ చివరిగా తమిళంలో పెణ్‌ సింగం (2010) అనే చిత్రంలో గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇచ్చారు. అలా 100కు పైగా చిత్రాల్లో నటించిన ఈమె 2010లో కెనడాకు చెందిన ఇంద్రకుమార్‌ పద్మనాధన్‌ అనే పారిశ్రామిక వేత్తను పెళ్లాడారు. ఆ తరువాత కూడా కొన్ని చిత్రాల్లో నటించిన రంభ 2017 తరువాత నటనకు దూరమయ్యారు. కాగా 49 ఏళ్ల రంభ ఇప్పుడు చెన్నైకి మకామ్‌ మార్చి మళ్లీ సినిమాలపై దృష్టి సారిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ నటించాలా, నిర్మాతగా చిత్రాలు నిర్మించాలా అనే సందిగ్ధంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈమె ఇంతకుముందు చిత్ర నిర్మాణం ప్రారంభించి త్రీ రోజెస్‌ అనే చిత్రాన్ని నిర్మించారన్నది తెలిసిందే. 

అయితే, ఆ చిత్రం రంభను నిరాశపరచింది.  కొందరు దర్శకులు మాత్రం రంభ నిర్మించే చిత్రాలకు పనిచేయాలని ఆశపడుతున్నట్లు టాక్‌.. కారణం ఆమె భర్త వేల కోట్లకు అధిపతి కావడమేననే టాక్‌ మరో పక్క సామాజక మాధ్యమాల్లో  వైరల్‌ అవుతోంది. ఇకపోతే ఒక తమిళ చిత్రంలో పార్థిబన్‌, రంభ కలిసి నటించారు. అలా షూటింగ్‌కు వచ్చిన ఆమెను చూసిన పార్థిబన్‌తో పాటు తదితర సినీ ప్రముఖులు రంభ సార్‌ అంటూ ఆమెను తెగ అభిమానిస్తూ చుట్టుముట్టేశారు. అలాంటి రంభ ఇప్పుడు మళ్లీ నటించడానికి సిద్ధం అవుతున్నారు. అందుకోసం ప్రత్యేకంగా ఫొటో షూట్‌ నిర్వహించి ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement