Kushboo: ఖుష్బూ కాలికి గాయం.. అయినా ఆపుకోని ప్రయాణం!

Actress Kushboo Leg Got Fractured - Sakshi

నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ. ఈ పేరే ఒక సంచలనం. 1990 ప్రాంతంలో అగ్ర కథానాయకిగా రాణించారు. రజినీకాంత్, కమల్‌ హాసన్, ప్రభు, కార్తీక్‌ వంటి ప్రముఖ హీరోలతో నటించారు. తెలుగు, హిందీ తదితర భాషల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. దర్శకుడు సుందర్‌.సిని ప్రేమ వివాహం చేసుకున్నారు. నటిగా కొనసాగుతూనే ఉన్నారు. అలాగే రాజకీయ రంగ ప్రవేశం చేసి ఆ రంగంలోనూ ఉనికిని చాటుకుంటున్నారు. ఈమెకు ఇద్దరు కూతుర్లు. కాగా బొద్దుగా ముద్దుగా ఉండే ఖుష్బూ ఇటీవల ఎవరూ ఊహించనంతగా స్లిమ్‌గా తయారయ్యారు. అదే విధంగా ఇటీవల విజయ్‌ కథానాయకుడిగా నటించిన వారిసు చిత్రంలో ఖుష్బూ ముఖ్యపాత్రను పోషించారు. అయితే ఆమె పోర్షన్‌ పూర్తిగా ఎడిటింగ్‌ రూమ్‌కే పరిమితం అయిపోయింది. ఇది ఆమె అభిమానులను నిరాశపరిచే విషయమే.

తాజాగా ఆమె మరో షాక్‌ ఇచ్చారు. కుడికాలుకు కట్టు కట్టిన ఫొటోలను తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేశారు. పక్కన రెండు వీల్‌ సూట్‌ కేసు ఫొటోలను కూడా ఉంచారు. అందులో “మీ జీవితంలో విచిత్రమైన విపత్తులు ఎదురై బాధిస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారు తెలియదు కానీ, తన ప్రయాణం మాత్రం కొనసాగుతుందని, సాధించేవరకూ ఆగదు అని పేర్కొన్నారు.

అదే విధంగా కోయంబత్తూర్‌ టూ ఢిల్లీ, హైదరాబాద్‌ టూ దుబాయ్‌ అంటూ తాను ప్రయాణించే ప్రాంతాల పేర్లను కూడా ప్రస్తావించారు. అలా తన కాలుకు దెబ్బ తగిలినా కూడా ఆమె తన ప్రయాణాన్ని రద్దు చేసుకోలేదు అనే విషయాన్ని తెలియజేశారు. అయితే అసలు ఖుష్బూకు జరిగిన ప్రమాదం ఏమిటి అని ఆమె అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే తన ప్రయాణం రద్దు కాదు, సాధించేవరకు ఆగదు అని పేర్కొన్నడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top