breaking news
fractured leg
-
ఖుష్బూ కాలికి గాయం.. అయినా ఆపుకోని ప్రయాణం!
నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ. ఈ పేరే ఒక సంచలనం. 1990 ప్రాంతంలో అగ్ర కథానాయకిగా రాణించారు. రజినీకాంత్, కమల్ హాసన్, ప్రభు, కార్తీక్ వంటి ప్రముఖ హీరోలతో నటించారు. తెలుగు, హిందీ తదితర భాషల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. దర్శకుడు సుందర్.సిని ప్రేమ వివాహం చేసుకున్నారు. నటిగా కొనసాగుతూనే ఉన్నారు. అలాగే రాజకీయ రంగ ప్రవేశం చేసి ఆ రంగంలోనూ ఉనికిని చాటుకుంటున్నారు. ఈమెకు ఇద్దరు కూతుర్లు. కాగా బొద్దుగా ముద్దుగా ఉండే ఖుష్బూ ఇటీవల ఎవరూ ఊహించనంతగా స్లిమ్‌గా తయారయ్యారు. అదే విధంగా ఇటీవల విజయ్ కథానాయకుడిగా నటించిన వారిసు చిత్రంలో ఖుష్బూ ముఖ్యపాత్రను పోషించారు. అయితే ఆమె పోర్షన్ పూర్తిగా ఎడిటింగ్ రూమ్‌కే పరిమితం అయిపోయింది. ఇది ఆమె అభిమానులను నిరాశపరిచే విషయమే. తాజాగా ఆమె మరో షాక్ ఇచ్చారు. కుడికాలుకు కట్టు కట్టిన ఫొటోలను తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశారు. పక్కన రెండు వీల్ సూట్ కేసు ఫొటోలను కూడా ఉంచారు. అందులో “మీ జీవితంలో విచిత్రమైన విపత్తులు ఎదురై బాధిస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారు తెలియదు కానీ, తన ప్రయాణం మాత్రం కొనసాగుతుందని, సాధించేవరకూ ఆగదు అని పేర్కొన్నారు. అదే విధంగా కోయంబత్తూర్ టూ ఢిల్లీ, హైదరాబాద్ టూ దుబాయ్ అంటూ తాను ప్రయాణించే ప్రాంతాల పేర్లను కూడా ప్రస్తావించారు. అలా తన కాలుకు దెబ్బ తగిలినా కూడా ఆమె తన ప్రయాణాన్ని రద్దు చేసుకోలేదు అనే విషయాన్ని తెలియజేశారు. అయితే అసలు ఖుష్బూకు జరిగిన ప్రమాదం ఏమిటి అని ఆమె అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే తన ప్రయాణం రద్దు కాదు, సాధించేవరకు ఆగదు అని పేర్కొన్నడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar) -
కాలు విరిగి.. యాక్షన్ సీన్లు ఆలస్యం: సోనూ సూద్
విలన్ పాత్రలకు పెట్టింది పేరైన సోనూ సూద్‌కు కాలు విరిగిందట. తాజాగా శుక్రవారం విడుదలైన 'ఆర్.. రాజ్‌కుమార్' చిత్రంలో నటించిన సోనూ, ఈ ప్రమాదం వల్ల తనకు యాక్షన్ సన్నివేశాల్లో నటించడం చాలా కష్టమైందని బాధపడిపోయాడు. ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు చాలా బాగుంటాయని, కానీ షూటింగ్ మొదలు కావడానికి ముందే తన కాలు విరిగిందని, అది కూడా ఒకచోట కాదు.. ఏకంగా ఆరేడు చోట్ల ఫ్రాక్చర్లు ఉన్నాయని సోనూ సూద్ తెలిపాడు. అందువల్ల తాను యాక్షన్ సన్నివేశాలు చేయడానికి చాలా ఇబ్బంది అయ్యిందన్నాడు. తన కాలు బాగుపడేవరకు ఈ సన్నివేశాలు షూట్ చేయడానికి కుదరలేదు కాబట్టి, కొన్ని నెలల పాటు ఈ సన్నివేశాల షూటింగును వాయిదా వేశారని గురువారం నాడు ఓ ఇంటర్వ్యూలో సోనూ సూద్ వివరించాడు. అందుకే షూటింగ్ కూడా ఆలస్యమైందన్నాడు. ప్రభుదేవా తీసిన 'ఆర్.. రాజ్‌కుమార్' చిత్రంలో షాహిద్ కపూర్, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులోని క్లైమాక్సులో వచ్చే యాక్షన్ సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉంటాయని, వాటిని చూసినప్పుడు మిగిలిన మంచి యాక్షన్ సినిమాలను మర్చిపోతారని సోనూ సూద్ అన్నాడు.