Actress Kavya Thapar Arrested Over Abusing Policemen And Drunk And Driving Case - Sakshi
Sakshi News home page

Actress Kavya Thapar Arrest:డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో హీరోయిన్‌ అరెస్ట్‌, అర్థరాత్రి యాక్సిడెంట్‌

Feb 18 2022 8:42 PM | Updated on Feb 18 2022 9:09 PM

Actress Kavya Thapar Arrested In Mumbai In Drunk And Drive Case - Sakshi

పోలీసులతో వాగ్వాదానికి దిగింది. అంతేకాదు డ్యూటీలో ఉన్న పోలీసులతో గొడవ పడింది. అంతేగాక లేడీ కానిస్టేబుల్స్‌ పట్ల అభ్యంతరకరంగా వ్యవహరించింది.

టాలీవుడ్‌ హీరోయిన్‌ కావ్యా థాపర్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. నిన్న(గురువారం) అర్థరాత్రి తాగి కారు నడిపి యాక్సిడెంట్‌కు కారణమైన ఆమెను పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం.. ఈ మాయ పేరేమిటో, ఏక్‌ మిని కథ చిత్రాలతో కావ్యా థాపర్‌ టాలీవుడ్‌లో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

చదవండి: నష్టా‍ల్లో రామ్‌ చరణ్‌ బిజినెస్‌, నిలిచిపోయిన సేవలు

ఇక బాలీవుడ్‌లో అవకాశాల కోసం ముంబైలో ఉంటున్న ఆమె గురువారం రాత్రి ఓ పార్టీకి హజరైంది.  ఈ నేపథ్యంలో బాగా తాగిన ఆమె అర్థరాత్రి కారు నడుపుతూ ముంబైలోని జెడబ్ల్యూ మారియట్ హోటల్ వద్ద యాక్సిడెంట్ చేసింది. ఆ ఘటనలో ఒకరు గాయపడ్డారు. ఈ ప్రమాదానికి కారణమైన ఆమెను పోలీసులు ప్రశ్నించగా ఆమె వారితో వాగ్వాదానికి దిగింది. అంతేకాదు డ్యూటీలో ఉన్న పోలీసులతో గొడవ పడుతూ లేడీ కానిస్టేబుల్స్‌ పట్ల అభ్యంతరకరంగా వ్యవహరించింది.

చదవండి: భీమ్లా నాయక్‌ నిర్మాత నోటి దురద.. ఆపై సారీ!

మహిళ పోలీసుల కాలర్‌ పట్టుకుని వారిని అసభ్యకర పదజాలంతో దూషణకు దిగింది. అర్థరాత్రి రోడ్డుపై కావ్యా గొడవ పడుతూ రచ్చ రచ్చ చేయడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆమెను జూహు పోలీసు స్టేషన్‌కు తరలించారు. అంధేరి కోర్టులో శుక్రవారం ఆమెను హాజరుపరచగా.. జ్యూడిషియల్ కస్టడీ విధించారు. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో అర్థరాత్రి రోడ్డుపై మద్యం మత్తులో హీరోయిన్ హల్చల్ అంటూ సినీ ఇండస్ట్రీలో కావ్యా థాపర్ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. 

Advertisement
 
Advertisement
Advertisement