Kangana Ranaut: బర్త్‌డే రోజు క్షమాపణలు కోరిన కంగనా.. వీడియో వైరల్‌

Actress Kangana Ranaut Shares Video And Seeks Apology on Her Birthday - Sakshi

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ క్షమాపణలు కోరింది. గురువారం(మార్చి 23న) ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఓ వీడియో పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా తన ప్రయాణంలో భాగమైన ప్రతిఒక్కరికి ఆమె కృతజ్ఞలు తెలిపింది. అలాగే తనని ద్వేషించే వారిని ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ వీడియోలో కంగనా మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు నేను చేసిన వ్యాఖ్యలకు ఎవరైనా బాధపడి ఉంటే నన్ను క్షమించండి. దేశ సంక్షేమం కోసమే నేను అలా మాట్లాడుతుంటాను.

చదవండి: 2018లో నిశ్చితార్థం.. తాజాగా మలేషియాలో సీక్రెట్‌ వెడ్డింగ్‌.. షాకిచ్చిన నటి

అందరికి మంచి జరగాలనేదే నా ఉద్దేశం’ అని చెప్పింది. అనంతరం తన తల్లిదండ్రులు, ఆధ్యాత్మిక గురువులు, సద్గురు, స్వామి వివేకానంద, వారందరికి ధన్యవాదాలు చెప్పంది. ఈ సందర్భంగా తన శత్రువులను గుర్తు చేసుకుంటూ వారికి కృతజ్ఞతులు తెలిపింది. ‘‘నా శత్రువులు నన్ను విశ్రాంతి తీసుకోకుండా పని చేసేలా చేస్తున్నారు. నా విజయానికి కారణమయ్యారు. సమస్యలను ఎలా అధిగమించాలో, ఎలా పోరాడాలో వారే నాకు నేర్పించారు. వారికి నేనెప్పటికీ కృతజ్ఞురాలిని’’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

చదవండి: అప్పుడు సో కాల్డ్‌ అంటూ కామెంట్స్‌.. ఇప్పుడు ఏకంగా మాజీ ప్రియుడికి క్రెడిట్‌..

కాగా తన పుట్టిన రోజు సందర్భంగా ఉదయ్‌పూర్‌లోని అంబికా మాత ఆలయాన్ని సందర్శించినట్లు కంగనా మరో పోస్ట్‌ పెట్టింది. కాగా ప్రస్తుతం కంగనా ఇందీరా గాంధీ బయోపిక్‌లో నటిస్తోంది. తానే దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న ఈ సినిమాకు ఎమర్జెన్సీ టైటిల్‌ను ఖరారు చేశారు. భారత రాజకీయ చరిత్రలో ఓ ప్రధాన ఘట్టమైన ఎమర్జెన్సీ రోజుల నాటి ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. మరోవైపు ఆమె చంద్రముఖీ 2లో నటిస్తోంది. ఇటీవల తన షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకుంది కంగనా. 

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top