సీరియల్ నటి రెండో పెళ్లి.. అసలు మేటర్ బయటపెట్టేసింది! | Actress Jyothi Rai Wedding With Suku Purvaj Pics Goes Viral | Sakshi
Sakshi News home page

Jyothi Rai: ఇన్నాళ్లు రూమర్స్.. ఇకపై రిలేషన్ అఫీషియల్

Sep 29 2023 4:44 PM | Updated on Sep 29 2023 4:54 PM

Actress Jyothi Rai Wedding With Suku Purvaj Pics Viral - Sakshi

తెలుగు రాష్ట్రాల్లో సినిమాల కంటే సీరియల్స్‌కి క్రేజ్ ఎక్కువని చెప్పొచ్చు. అలా 'గుప్పెడంత మనసు' సీరియల్‌లో జగతి మేడమ్ పాత్రలో ఫేమ్ తెచ్చుకున్న నటి జ్యోతిరాయ్. స్వతహాగా కన్నడ అయినప్పటికీ తెలుగులో బోలెడంత ఫాలోయింగ్ సంపాదించింది. ఆల్రెడీ పెళ్లయిపోయిన ఈ బ్యూటీ కొన్నాళ్లుగా ఓ కుర్ర దర్శకుడితో రిలేషన్‌లో ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వాటిపై స్వయంగా జ్యోతినే క్లారిటీ ఇచ్చేసింది.

ఎవరీ జ్యోతిరాయ్?
కర్ణాటకకు చెందిన జ్యోతిరాయ్.. 'బందె బరాటవ కాలా' సీరియల్‌‌తో నటిగా మారింది. 20కి పైగా సీరియల్స్‌లో అంటే తుళు, కన్నడ, తమిళం, తెలుగు భాషల్లో నటించింది. అలానే 'సీతారామ కళ్యాణ', 'గంధాడ్ గుడి', '99', 'దియ వర్ణపాటల' తదితర సినిమాల్లో సహాయ పాత్రలు చేసింది. ప్రస్తుతం 'గుప్పెడంత మనసు' సీరియల్ లో హీరోకి తల్లి పాత్ర చేస్తున్నప్పటికీ.. మరోవైపు వెబ్‌సిరీస్‌ల్లో హీరోయిన్‌గా చేస్తోంది. తాజాగా ఫస్ట్‌లుక్ కూడా రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: ‘పెదకాపు 1’ మూవీ రివ్యూ)

రూమర్స్ నిజమయ్యాయి
20 ఏళ్ల వయసులోనే పద్మనాభ అనే వ్యక్తితో పెళ్లి కాగా.. వీరికి ఒక బాబు కూడా ఉన్నారు. మరి ఏమైందో ఏమో కానీ అతడికి దూరంగా ఉంటుంది. అలానే గత కొన్నాళ్లుగా సుకు పుర్వాజ్ అనే యంగ్ డైరెక్టర్‌తో రిలేషన్‌లో ఉంది. ఇద్దరూ సన్నిహితంగా ఉన్న కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో స్వయంగా ఈమెనే పోస్ట్ చేయడంతో ఈ విషయం అందరికీ క్లారిటీ వచ్చేసింది. తాజాగా రిలీజ్ ఓ వెబ్ సిరీస్ ఫస్ట్‌లుక్‌లోనూ తన పేరు మార్చుకుని.. జ్యోతి పుర్వాజ్ అనే ఉంది. దీంతో అందరూ ఆల‍్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయారు.

రింగ్‌తో హింట్
అయితే వీళ్లిద్దరూ మొన్నటివరకు రిలేషన్‪‌లో ఉన్నారు. ఇప్పుడు నిశ్చితార్థం కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా సుకు పుర్వాజ్ కలిసున్న కొన్ని ఫొటోల్ని కలిపి ఇన్ స్టాలో పోస్ట్ చేసిన జ్యోతిరాయ్.. క్యాప్షన్‌లో రింగ్(ఉంగరం) గుర్తుతోపాటు లవ్ బర్డ్స్ ఏమోజీని కూడా పెట్టింది. దీంతో ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు ఈమెనే చెప్పేసింది. దీన్నిబట్టి చూస్తే త్వరలో పెళ్లి చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.

(ఇదీ చదవండి: హెచ్చరించినా తీరు మార్చుకోని శివాజీ.. పంపించేస్తే బెటర్!)

Advertisement
 
Advertisement
Advertisement