డ్రగ్స్ పార్టీలో ట్విస్ట్.. నటి హేమ రక్త నమూనా రిపోర్ట్‌ విడుదల | Sakshi
Sakshi News home page

బెంగళూరు డ్రగ్స్ పార్టీలో ట్విస్ట్.. నటి హేమ రక్త నమూనా రిపోర్ట్‌ విడుదల

Published Thu, May 23 2024 12:23 PM

Actress Hema Is Confirmed Drugs Take Released Now Report

బెంగళూరు నగర శివారులోని ఓ ఫాంహౌస్‌లో జరిగిన రేవ్‌పార్టీ టాలీవుడ్‌ను కుదిపేసింది. ఈ పార్టీలో  సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ బి.దయానంద్‌ తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధులెవరూ ఈ పార్టీలో పాల్గొనలేదన్నారు. అయితే, పట్టుబడిన వారి బ్లడ్‌ శాంపిల్స్‌ రిపోర్ట్‌ను వారు విడుదల చేశారు. దీంతో సినీ నటి హేమకు చిక్కులు తప్పవని తెలుస్తోంది.

 రక్త నమూనాలో డ్రగ్స్ ఆనవాళ్లు
ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం కూడా జరిగినట్లు పోలీసులు తెలిపారు. రేవ్‌ పార్టీలో పాల్గొన్న సుమారు 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందరి రక్త నమూనాలను నార్కోటిక్ టీం సేకరించింది. తాజాగా అందరి రక్త నమూనా రిపోర్ట్‌లు వచ్చాయని కర్ణాటక పోలీసులు తెలిపారు. తెలుగు నటి హేమ రక్త నమూనాలో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించామని వారు తెలిపారు.

86 మందికి పాజిటివ్‌
డ్రగ్ టెస్టులో నటి హేమ సహా 86 మందికి పాజిటివ్‌గా తేలిందని కర్ణాటక పోలీసులు తెలిపారు. డ్రగ్స్‌ తీసుకున్నట్లు రక్త నమూనా పరీక్షలో నిర్ధారణ అయిన వ్యక్తులకు సీసీబీ నోటీసులు ఇస్తుందన్నారు. పట్టుబడిన వారిలో 59 మంది పురుషుల రక్త నమూనాల్లో డ్రగ్స్‌ ఆనవాళ్ళు ఉన్నాయన్నారు. 27 మంది మహిళల రక్త నమూనాల్లో డ్రగ్స్‌ తీసుకున్నట్లు రిపోర్ట్‌ వచ్చిందన్నారు. ఇప్పటి వరకు 103 మందిలో మొత్తం 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిందన్నారు. వారందరికీ సమన్లు జారీ చేసి కౌన్సెలింగ్‌కు పిలిచే అవకాశం ఉంటుందన్నారు. డ్రగ్స్‌ తీసుకున్నవాళ్లను బాధితులుగా పరిగణించేందుకే ఎక్కువ అవకాశాలు ఉంటాయని పోలీసులు తెలుపుతున్నారు.

పేరు మార్చుకున్న హేమ
బెంగుళూరు డ్రగ్స్ కేసులో పోలీసులకు నటి హేమ వరుసగా ట్విస్ట్‌లు ఇచ్చింది. పార్టీకి వెళ్తున్న క్రమంలో తన పేరు బయటికి రాకుండా ఆమె చాలా జాగ్రత్తలు తీసుకుంది. తన అసలు పేరుకు బదులుగా కృష్ణవేణి పేరుతో పార్టీకి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. హేమా, చిరంజీవి, ఆశి రాయికి  బెంగుళూరు సీసీబి పోలీసులు నోటిసులు ఇవ్వనున్నారు.

రేవ్‌ పార్టీలో తెలుగు సినీనటి హేమ పేరు వచ్చిన వెంటనే ఆమె జాగ్రత్త పడి, ఫాంహౌస్‌ ఖాళీ స్థలంలోకి వెళ్లి నేను ఆ పార్టీలో లేను, హైదరాబాద్‌లో ఫాంహౌస్‌లో ఉన్నాను అని చెప్పింది. ఆ సమయంలో ఆమె ఫోటోను పోలీసులు విడుదల చేశారు. ఆ తర్వాత ఆమె తన ఇంట్లో ఉన్న మరొ వీడియోను విడుదల చేసింది. అయితే, తాజాగా పోలీసులు ఇచ్చిన ప్రకటనతో ఆమె ఇంకా రియాక్ట్‌ కాలేదు. 

Advertisement
 
Advertisement
 
Advertisement