తెలుగులో ఫస్ట్ మూవీనే సూపర్ హిట్.. కానీ ఆ తర్వాతే.. ఈమెని గుర్తుపట్టారా? | Sakshi
Sakshi News home page

Guess The Actress: ఆల్రెడీ పెళ్లయిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది.. కానీ ఇప్పటికీ

Published Mon, May 20 2024 7:28 PM

Actress Hansika Childhood Pic With Her Mother

ఈ చిన్నారి చిన్నప్పుడే సినిమాల్లోకి వచ్చేసింది. ఇక తెలుగులో స్టార్ హీరో అల్లు అర్జున్ హిట్ సినిమాతో హీరోయిన్ అయ్యింది. అది సూపర్ హిట్ అయ్యేసరికి ఈమె వరస ఛాన్సులు వచ్చాయి. కానీ ఈమెకు ఎందుకో తెలుగులో పెద్దగా లక్ కలిసి రాలేదు. దీంతో పక్కనే ఉన్న తమిళంలో సెటిలైపోయింది. మరి ఇంతలా చెప్పాం కదా ఈమెని గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?

(ఇదీ చదవండి: నేనూ మనిషినే.. అలా అంటే తట్టుకోవడం కష్టం: యువ హీరోయిన్)

పైన ఫొటోలో కనిపిస్తున్న పాప పేరు హన్సిక. హా అవును మీరు ఊహించింది కరెక్టే. 'దేశముదురు' మూవీతో హీరోయిన్ అయిన హన్సిక.. అంతకు ముందు హిందీలో 'కోయి మిల్ గయా'లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసింది. ఇక తెలుగులో కంత్రి, బిల్లా, కందిరీగ, ఓ మై ఫ్రెండ్, దేనికైనా రెడీ తదితర చిత్రాలతో సక్సెస్ అందుకుంది. కానీ స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. కానీ తమిళంలో మాత్రం స్టార్ హోదా సొంతం చేసుకుంది.

ఇప్పుడు కూడా దాదాపు మూడు తమిళ సినిమాల్లో హన్సిక ప్రధాన పాత్రలో నటిస్తోంది. వ్యక్తిగత విషయానికొస్తే 2022లో సొహైల్ కతూరియా అనే బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకుంది. చాలామంది పెళ్లి చేసుకుంటే సినిమాలకు బ్రేక్ ఇస్తుంటారు. కానీ హన్సిక మాత్రం మరింత జోరుగా మూవీస్ చేస్తోంది. తాజాగా తల్లితో కలిసి ఓ వీడియో పోస్ట్ చేసిన ఈ వైట్ బ్యూటీ.. తన చిన్నప్పటి ఫొటోని షేర్ చేసింది. ఇందులో హన్సికని చూసి చాలామంది గుర్తుపట్టలేకపోతున్నారు.

(ఇదీ చదవండి: బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. పేరేంటో తెలుసా?)

Advertisement
 
Advertisement
 
Advertisement