నేనూ మనిషినే.. అలా అంటే తట్టుకోవడం కష్టం: యువ హీరోయిన్ | Sakshi
Sakshi News home page

Anika Surendran: బ్యాడ్ కామెంట్స్.. హర్ట్ అయిన యంగ్ బ్యూటీ

Published Mon, May 20 2024 3:58 PM

Anikha Surendran Respond On Bad Comments On Her Dressing

సోషల్ మీడియా వల్ల ఎంత మంచి ఉందో అంతే చెడు కూడా ఉంది. ఈ విషయం అందరికీ తెలుసు. చాలామంది నెటిజన్లు.. హీరోయిన్లని ఇష్టమొచ్చినట్లు కామెంట్ చేసేస్తుంటారు. దీని వల్ల అవతలి వ్యక్తులు ఏమనుకుంటారో అనేది మాత్రం అస్సలు ఆలోచించరు. తాజాగా తన ఫొటోలపై చాలా అసభ్యంగా కామెంట్స్ చేస్తున్నారని యువ హీరోయిన్ అనికా సురేంద్రన్ ఆవేదన వ్యక్తం చేసింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి ఫ్రీడమ్ ఫైటర్ బయోపిక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

'ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఇలాంటి విమర్శలు ఎదుర్కొంటున్నారు. గ్లామర్ కనిపించేలా డ్రస్ వేసుకోవడం నా వ్యక్తిగతం. ఎవరెన్ని అనుకున్నా సరే నా ఇష్టాన్ని పక్కన పెట్టలేను. ఈ విమర్శలు వస్తుంటాయి, పోతుంటాయి. అవన్నీ జీవితంలో ఓ భాగం మాత్రమే. కామెంట్ చేయాలనే ఉద్దేశం ఉన్నోడు..  చీర కట్టినా సరే అలానే అంటాడు. అయితే నా డ్రస్సింగ్ గురించి కొందరు చేసే కామెంట్స్ మాత్రం నన్ను చాలా ప్రభావితం చేస్తున్నాయి. నేను కూడా మనిషినే. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తట్టుకోవడం నాకు కష్టంగా ఉంటుంది. దయచేసి కామెంట్స్ చూసుకుని పెట్టండి. పర్సనల్ విషయాలు వద్దు' అని అనికా తన బాధని చెప్పుకొచ్చింది.

చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన అనికా.. 'విశ్వాసం'లో అజిత్ కూతురిగా నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో నటించింది. తెలుగులో 'బుట్టబొమ్మ' మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తమిళ, మలయాళంలో నటిస్తున్న ఈమె.. అప్పడప్పుడు గ్లామరస్ ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు దీనికి వచ్చిన కామెంట్స్ తట్టుకోలేక తన బాధని బయటపెట్టింది.

(ఇదీ చదవండి: నాగబాబు ట్వీట్ వివాదం.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం!)

Advertisement
 
Advertisement
 
Advertisement