Actress Divyansha Kaushik: రామారావుతో మజిలీ బ్యూటీ బ్రేక్‌ అందుకునేనా?

Actress Divyansha Kaushik Hopes On Ramarao On Duty Movie - Sakshi

మాస్‌ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం రామారావు ఆన్‌ డ్యూటీ. ఇందులో రజీషా, దివ్యాంశ హీరోయిన్లు. ఈ సినిమాపైనే బోలెడన్ని ఆశలు పెట్టుకుంది దివ్యాంశ. ఈ కథానాయిక మజిలీ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. అందులో అన్షు పాత్రతో ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత టక్కర్‌ మూవీతో కోలీవుడ్‌లో అరంగేట్రం చేసింది. త్వరలోనే రామారావు ఆన్‌ డ్యూటీతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పాటలకు మంచి ఆదరణ లభించింది. ఈసారైనా తనకు మంచి బ్రేక్‌ వస్తుందేమోనని కొండంత ఆశతో ఎదురు చూస్తోంది దివ్యాంశ. మరి దివ్యాంశకు రామారావు ఆన్‌ డ్యూటీ ఏమేరకు ప్లస్‌ అవుతుందో చూడాలి! కాగా శరత్‌ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సీనియర్‌ హీరో వేణు తొట్టెంపూడి, నాజర్‌, తనికెళ్ల భరణి, పవిత్రా లోకేశ్‌ ముఖ్యపాత్రల్లో నటించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ, రవితేజ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్లపై సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు.

చదవండి: వారియర్‌ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ ఎంతంటే?
నేనేమైనా ఉగ్రవాదినా? పెళ్లి చేసుకోకూడదా?

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top