Rakhi Sawant Reveals Boyfriend Adil Khan is Told No One Would Marry His Sister If He Marries Her - Sakshi
Sakshi News home page

Rakhi Sawant: నేనేమైనా ఉగ్రవాదినా? పెళ్లి చేసుకోకూడదా?

Jul 15 2022 4:22 PM | Updated on Jul 15 2022 4:54 PM

Rakhi Sawant Reveals Boyfriend Adil Khan is Told No One Would Marry His Sister If He Marries Her - Sakshi

వాళ్లకు పెళ్లిళ్లు కావడం లేదా? ఆ అమ్మాయిలు ఎక్స్‌పోజ్‌ చేయడం లేదా? ఐటం సాంగ్స్‌లో ఆడిపాడటం లేదా? నేను అదిల్‌ను పెళ్లి చేసుకున్నా అతడి కుటుంబంపై అది ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపించదు. కానీ కొందరు అనవసరంగా ఏదేదో వాగుతున్నారు.

బాలీవుడ్‌ బ్యూటీ, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ రాఖీ సావంత్‌, వ్యాపారవేత్త అదిల్‌ ఖాన్‌ కొద్ది నెలలుగా డేటింగ్‌లో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే! అయితే రాఖీ డ్రెస్సింగ్‌ స్టైల్‌పై అదిల్‌, అతడి కుటుంబం కొంత అభ్యంతరం వ్యక్తం చేసింది. పద్ధతి మార్చుకోవాలని సెలవిచ్చింది. దీంతో కాబోయే అత్తమామల మాటలను తు.చ తప్పకుండా పాటించింది రాఖీ. మరీ బోల్డ్‌గా ఉండే డ్రెస్సులు వేసుకోవడం మానేసింది. పార్టీలకు, ఫంక్షన్లకు వెళ్లినా కూడా అదిల్‌ సెలక్ట్‌ చేసిన దుస్తులనే ధరిస్తోంది.

అయినప్పటికీ రాఖీని పెళ్లి చేసుకునేందుకు అదిల్‌ రెడీ అవడాన్ని పలువురు తప్పుపట్టారు. తాజాగా ఈ విషయంపై రాఖీ సావంత్‌ మాట్లాడుతూ ఎమోషనలైంది. 'బాలీవుడ్‌లో ఎందరో ముస్లింలు ఉన్నారు. వాళ్లకు పెళ్లిళ్లు కావడం లేదా? ఆ అమ్మాయిలు ఎక్స్‌పోజ్‌ చేయడం లేదా? ఐటం సాంగ్స్‌లో ఆడిపాడటం లేదా? నేను అదిల్‌ను పెళ్లి చేసుకున్నా అది అతడి కుటుంబంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపించదు. కానీ కొందరు అనవసరంగా ఏదేదో వాగుతున్నారు. అదిల్‌ నన్ను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తే అతడి చెల్లిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? అని కామెంట్‌ చేస్తున్నారు. ఏంటీ చెత్తవాగుడు? నేనేమైనా ఉగ్రవాదినా? నేను పెళ్లి చేసుకోకూడదా? నా వల్ల ఆమెకు సంబంధాలు ఎందుకు చెడిపోతాయి? ఏదేమైనా పెళ్లిళ్లు స్వర్గంలోనే నిర్ణయిస్తారన్న మాట గుర్తుపెట్టుకుంటే మంచిది' అని చెప్పుకొచ్చింది.

చదవండి:  తన లవ్‌ మ్యారేజ్‌ గురించి ఓపెన్‌ అయిన ఇంద్రజ
రూ. 1000 కోట్ల రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేసిన హీరో?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement