Ram Pothineni The Warriorr Movie First Day Collection Updates - Sakshi
Sakshi News home page

The Warriorr Movie 1st Day Collection: వారియర్‌ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ ఎంతంటే?

Jul 15 2022 5:21 PM | Updated on Jul 15 2022 6:07 PM

Ram Pothineni The Warriorr Movie First Day Collection - Sakshi

మిశ్రమ స్పందన అందుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు ఎంత షేర్‌ సాధించిందో తెలుసా? అక్షరాలా ఎనిమిది కోట్ల రూపాయలు. మొత్తంగా రూ.39.10 కోట్లు ప్రీరిలీజ్‌ బిజినెస్‌ జరిపిన వారియర్‌ మూవీ బ్రేక్‌ ఈవెన్‌ కావాలంటే

రామ్‌ పోతినేని, కృతీశెట్టి జంటగా నటించిన మూవీ వారియర్‌. ఆది పినిశెట్టి విలన్‌గా, అక్షర గౌడ ముఖ్యపాత్రలు పోషించారు. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. కోలీవుడ్‌ డైరెక్టర్‌ లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో జూలై 14న విడుదలైంది. కాన్సెప్ట్‌ కొత్తగా ఉందని, రామ్‌ మరోసారి తన నటనతో, స్టెప్పులతో ఇరగదీశాడంటూ ప్రశంసలు వెల్లువెత్తాయి. అదే సమయంలో కథనం మాత్రం సరికొత్తగా ఏమీ లేదంటూ కొందరు సినీవిశ్లేషకులు బాహాటంగానే విమర్శించారు.

మరి మిశ్రమ స్పందన అందుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు ఎంత షేర్‌ సాధించిందో తెలుసా? రూ.8.73 కోట్లు. మొత్తంగా రూ.39.10 కోట్లు ప్రీరిలీజ్‌ బిజినెస్‌ జరిపిన వారియర్‌ మూవీ బ్రేక్‌ ఈవెన్‌ కావాలంటే రూ.39 కోట్లు రాబట్టాలి. మరి మొదటి రోజు వారియర్‌ ఏయే ప్రాంతాల్లో ఎంత వసూలు చేసిందో కింద చూసేయండి..

♦ నైజాం : రూ.1.96 కోట్లు
♦ సీడెడ్‌ : రూ.1.04 కోట్లు
♦ యూఏ : రూ.1.02 కోట్లు
♦ తూర్పు గోదావరి : రూ.51 లక్షలు
♦ పశ్చిమ గోదావరి: రూ.67 లక్షలు
♦ గుంటూరు : రూ.1.19 కోట్లు
♦ కృష్ణా: రూ.38 లక్షలు
♦ నెల్లూరు : రూ.29 లక్షలు
♦ వైజాగ్‌: రూ.1.02 కోట్లు

ఆంధ్రా, తెలంగాణ మొత్తం షేర్‌ : రూ.7 కోట్ల పైచిలుకు

♦ కర్ణాటక: రూ.32 లక్షలు
♦ తమిళనాడు: రూ.94 లక్షలు
♦ ఓవర్సీస్‌: రూ. 30 లక్షలు

ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వసూళ్లు: రూ.8.73 కోట్లు

చదవండి: రూ. 1000 కోట్ల రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేసిన హీరో?
అన్నదమ్ములతో హీరోయిన్ల డేటింగ్‌ !.. ఫొటోలు వైరల్‌

Advertisement
 
Advertisement
Advertisement