గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్‌ బ్యూటీ.. | Actress Ayesha Takia Recently Shared A Blue Saree Photo On Her Instagram; See Netizens Reactions | Sakshi
Sakshi News home page

ఈ సూపర్‌ బ్యూటీని గుర్తుపట్టారా? ఇలా అయిపోయిందేంటి?

Aug 22 2024 3:55 PM | Updated on Aug 22 2024 4:15 PM

Actress Ayesha Takia Recently Shared A Blue Saree Photo On Her Instagram; See Netizens Reactions

తమ అందాన్ని కాపాడుకోవాలని జాగ్రత్తపడే తారలు కొందరైతే దాన్ని రెట్టింపు చేసుకోవాలని ఉబలాటపడే బ్యూటీలు మరికొందరు. పెద్దగా అవకాశాల్లేక, వెండితెరకు దూరంగా ఉండే ముద్దుగుమ్మలైతే రీఎంట్రీ కోసం ఎన్నో పాట్లు పడుతుంటారు. పైన కనిపిస్తున్న బ్యూటీ ఆయేషా టకియా కూడా అదే కోవలోకి వస్తుంది. సూపర్‌ సినిమాతో తెలుగులో అదరగొట్టిన ఈ హీరోయిన్‌ బాలీవుడ్‌లో దిల్‌ మాంగే మోర్‌, టార్జాన్‌, సలాం ఇ ఇష్క్‌, వాంటెడ్‌, పాఠశాల వంటి హిట్‌ చిత్రాల్లో నటించింది.

13 ఏళ్లుగా వెండితెరకు దూరం
2011లో వచ్చిన మోద్‌ సినిమాలో చివరిసారిగా కనిపించింది. ఆ మరుసటి ఏడాది ఓ మ్యూజిక్‌ రియాలిటీ షోలోనూ తళుక్కుమని మెరిసింది. అనంతరం సోషల్‌ మీడియాలో మాత్రమే అలరిస్తోంది. తాజాగా ఆమె నీలిరంగు చీర కట్టి ఓ రీల్‌ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో వదలగా అది వైరల్‌గా మారింది. అందులో ఆమె పెదాలు ఉబ్బిపోయి ఉన్నాయి. ఇది చూసిన నెటిజన్లు తన లుక్‌ ఏమీ బాగోలేదని కామెంట్లు చేస్తున్నారు.

గుర్తుపట్టలేనట్లుగా మారిపోయిందే..
నువ్వు ఏడాది క్రితమే ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నావని తెలుసు. కానీ ఈ పోస్టులో మాత్రం అస్సలు గుర్తుపట్టలేనట్లే ఉన్నావు, తను ఆయేషా టాకియా అంటే నమ్మలేకపోతున్నాను. చిన్నప్పుడు తన సినిమాలు చూసి ముచ్చటపడిపోయాను. ఇప్పుడేంటి, ఇలా అయిపోయింది?, ఒకప్పుడు బాలీవుడ్‌లో రాణిగా వెలుగు వెలిగింది.. రీఎంట్రీ కోసమే ఈ అవతారం ఎత్తిందా? అని కామెంట్లు చేస్తున్నారు. కాగా లిప్‌ ఫిల్లర్స్‌ వేయించుకున్న తర్వాత ఈ బ్యూటీ ముఖమే మారిపోయింది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement