Atithi Devo Bhava Movie: 'అతిథి దేవో భవ' ట్రైలర్ విడుదల..

Actor Aadi Sai Kumar Atithi Devo Bhava Movie Trailer Released - Sakshi

Actor Aadi Sai Kumar Atithi Devo Bhava Movie Trailer Released: ఆది సాయికుమార్, సువేక్ష జంటగా నటించిన చిత్రం 'అతిథి దేవోభవ'. పొలిమేర నాగేశ్వర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. హీరో నాని ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. అన్ని విగ్రహాలు ఒక వైపు పెట్టి బుద్దుని మాత్రం ఇలా మధ్యలో వదిలేశారు అంటూ సాగే డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభమవుతుంది.

లవ్‌, యాక్షన్‌ ఓరియెంటెండ్‌గా ట్రైలర్‌ ఆకట్టుకుంటుంది. మిర్యాల రామ్ - అశోక్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. పెద్ద సినిమాలన్నీ సంక్రాంతి బరి నుంచి తప్పుకోవడంతో పలు చిన్న సినిమాలు పండగ బరిలోకి దిగుతున్నాయి. కొంతకాలంగా సరైన హిట్‌ కోసం ఎదురుచూస్తున్న ఆది ఈ సినిమాతో సక్సెస్‌ అందుకున్నాడా అన్నది చూడాల్సి ఉంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top