ప్రియురాలితో మూడో పెళ్లి.. అమిర్ ఖాన్ షాకింగ్ నిర్ణయం..! | Aamir Khan and Gauri Spratt to skip grand reception after Sunday wedding | Sakshi
Sakshi News home page

Aamir Khan: ముచ్చటగా మూడో పెళ్లి.. అమిర్ ఖాన్ షాకింగ్ డెసిషన్..!

Jul 2 2026 8:03 PM | Updated on Jul 2 2026 9:51 PM

Aamir Khan and Gauri Spratt to skip grand reception after Sunday wedding

బాలీవుడ్ స్టార్ హీరో ‍అమిర్ ఖాన్ ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకోబోతున్నారు. గతేడాది తన ప్రియురాలిని పరిచయం చేసిన 60 ఏళ్ల హీరో మరోసారి వివాహబంధంలోకి అడుగుపెడుతున్నారు. బెంగళూరుకు చెందిన తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌ను పెళ్లాడనున్నారు. ఈ నెల 5న వీరిద్దరి పెళ్లి జరగనుంది. కొద్దిమంది సన్నిహితుల సమక్షంలోనే ఈ జంట ఒక్కటి కానున్నారు. ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్‌గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోనున్నారు.

అయితే పెళ్లి తర్వాత గ్రాండ్ రిసెప్షన్‌ వేడుక ఉంటుందని అంతా భావించారు. కానీ అలాంటిదేమీ లేదని తెలుస్తోంది. కేవలం అమిర్ ఖాన్‌ ఇంట్లో అత్యంత సన్నిహితులకు మాత్రమే ట్రీట్ ఇవ్వనున్నారు. ఈ వేడుకను కేవలం సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలోనే  ప్రైవేట్‌గా జరుపుకోనున్నారు. ఈ విషయాన్ని సన్నిహితులు ఒకరు వెల్లడించారు. 

ఇటీవల ఇంటర్వ్యూలోనూ అమిర్ ఖాన్ ఇదే విషయాన్ని వెల్లడించారు. మా ఇంట్లోనే కేవలం ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహిత స్నేహితుల సమక్షంలో  రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటామని తెలిపారు. మేమిద్దరం చాలా నిరాడంబరంగా చేసుకోవాలని ముందే నిర్ణయించుకున్నామని అమిర్ పేర్కొన్నారు. కాగా.. జూలై 5న ఈ జంట పెళ్లిబంధతో ఒక్కటి కానున్నారు. కాగా.. గతేడాది తన బర్త్‌ డే సందర్భంగా అమిర్ ఖాన్ ప్రియురాలిని అభిమానులకు పరిచయం చేశారు.

కాగా.. అమిర్ ఖాన్‌కు ఇప్పటికే రెండు పెళ్లిళ్లు కాగా.. ఇద్దరితోనూ విడిపోయారు. ‍అమిర్ గతంలో రీనా దత్తాను వివాహం చేసుకున్నారు, వీరికి జునైద్, ఐరా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత డైరెక్టర్ కిరణ్ రావును పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆజాద్ అనే కుమారుడు ఉన్నాడు. మరోవైపు ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌కు సైతం ఓ కుమారుడు ఉన్నారు. ఆమె కూడా తన భర్తకు విడాకులిచ్చింది. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement