హీరోయిన్‌గా ఆమని మేనకోడలు.. పోస్టర్‌ విడుదల | Aamani Niece Hrithika Nari Nari Naduma Murari Poster Released | Sakshi
Sakshi News home page

Aamani Niece Hrithika: హీరోయిన్‌గా ఆమని మేనకోడలు.. పోస్టర్‌ విడుదల

Apr 27 2022 9:13 AM | Updated on Apr 27 2022 9:27 AM

Aamani Niece Hrithika Nari Nari Naduma Murari Poster Released - Sakshi

సినీ ఇండస్ట్రీలో వారసత్వంగా హీరో, హీరోయిన్లు కావడం సర్వసాధరణమే. కొంచెం టాలెంట్‌ ఉండి, వారసత్వం తోడేతే చిత్ర పరిశ్రమలో త్వరగా నిలుదొక్కుకోవచ్చు. ఇదే తరహాలో మరో బ్యూటీ వెండితెరకు పరిచయం కానుంది.

Aamani Niece Hrithika Nari Nari Naduma Murari Poster Released: సినీ ఇండస్ట్రీలో వారసత్వంగా హీరో, హీరోయిన్లు కావడం సర్వసాధరణమే. కొంచెం టాలెంట్‌ ఉండి, వారసత్వం తోడేతే చిత్ర పరిశ్రమలో త్వరగా నిలుదొక్కుకోవచ్చు. ఇదే తరహాలో మరో బ్యూటీ వెండితెరకు పరిచయం కానుంది. హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఆమని. శుభలగ్నం, మావి చిగురు, మిస్టర్‌ పెళ్లాం వంటి తదితర సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన ఆమె ప్రస్తుతం తల్లి పాత్రల్లో మెప్పిస్తోంది. ఆమని నట వారసురాలిగా ఆమె మేనకోడలు హృతిక వెండితెరపై అలరించడానికి సిద్ధమైంది. బాల నటిగా 3 సినిమాల్లో నటించిన హృతిక హీరోయిన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. 

అభిలాష్‌ భండారి హీరోగా, హృతిక హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘నారి నారి నడుమ మురారి’. జీవీకే దర్శకత్వంలో చక్ర ఇన్ఫోటైన్మెంట్‌ పతాకంపై వెంకటరత్నం నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా జీవీకే మాట్లాడుతూ.. ‘‘లవ్‌ అండ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. జూన్‌ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించి యానాం, అమలాపురం, వైజాగ్, లంబసింగి, హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని అందమైన లొకేషన్స్‌లో షూటింగ్‌ ప్లాన్‌ చేశాం. సింధు కే ప్రసాద్‌ సంగీతం, జే. ప్రభాకర్‌రెడ్డి సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తాయి’’ అన్నారు.  

చదవండి: చరణ్‌ నటన నాకు కొత్తగా అనిపించలేదు: చిరంజీవి

కానిస్టేబుల్‌గా కీర్తి సురేష్‌.. 24 హత్యలు.. ఆసక్తిగా 'చిన్ని' ట్రైలర్‌




Advertisement
 
Advertisement
Advertisement