న్యూస్‌రీల్
సిద్దిపేట గడ్డ.. ఇక
ఈ గడ్డ నుంచి గెలిచేవారికి మంత్రి పదవి
శుక్రవారం శ్రీ 20 శ్రీ నవంబర్ శ్రీ 2026
సిద్దిపేటజోన్/ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ప్రజాపాలన పేరిట రాష్ట్ర సమగ్రాభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమం దిశగా ముందుకు సాగుతున్న ఇందిరమ్మ రాజ్యం మళ్లీ 2029లో అధికారంలోకి రావడం ఖాయమని, ఆ దిశగా కాంగ్రెస్‌కు ఒకప్పుడు కంచుకోటగా నిలిచిన సిద్దిపేట గడ్డపైన కాంగ్రెస్ జెండా ఎగరడం తథ్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం మాజీప్రధాని దివంగత నేత ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి, పట్టణ వీధుల్లో పాదయాత్ర ద్వారా సభస్థలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సభావేదికపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ హన్మంతరావు ఆధ్వర్యంలో కొమురవెల్లి అర్చకులు సీఎం రేవంత్‌రెడ్డిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలనుద్దేశించి బహిరంగ సభలో మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టింది మాజీమంత్రి మదన్‌మోహన్ అన్నారు. సిద్దిపేటకు, కాంగ్రెస్ పార్టీకి మదన్‌మోహన్‌చేసిన సేవలకు గుర్తుగా సిద్దిపేట వైద్య కళాశాలకు ఆయన పేరును ప్రకటించారు. దానికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసి 24గంటల్లోగా జీవో జారీ చేయాలని వైద్యశాఖ మంత్రిని ఆదేశించారు. సిద్దిపేట గడ్డలో 2029లో కాంగ్రెస్ జెండా ఎగిరేలా ప్రజలు సహకరించాలని, ఇక్కడి నుంచి గెలిచిన ఎమ్మెల్యేకు ఇందిరమ్మ రాజ్యంలో మంత్రి పదవి వచ్చేలా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ బాధ్యత తీసుకుంటారన్నారు. నవంబర్ 26న రాష్ట్ర వ్యాప్తంగా రెండోవిడత ఇందిరమ్మ చీరల పంపిణీలో భాగంగా కోటిమంది మహిళలకు చీరలు పంపిణీ చేస్తామన్నారు. అంతకుముందు మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ...ఇందిరాగాంఽధీ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కుటుంబ జీవితబీమా పథకం అందించడం సంతోషకరమన్నారు.
963 రోజుల పాటు సాగిన ఉద్యమం: మంత్రి దామోదర
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. సిద్దిపేట ప్రాంతంలో నిర్వాసితుల కోసం దేశ చరిత్రలో లేనివిధంగా 963 రోజుల పాటు దీక్షలతో ఉద్యమం సాగిందన్నారు. దాని ఫలితమే ఆర్ అండ్ ఆర్ కాలనీల ఏర్పాటుతో 700 మంది బాధితులకు గృహ వసతి లభించిందన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ మాట్లాడుతూ.. సిద్దిపేట మున్సిపాలిటీకి రూ.50 కోట్లు మంజూరు చేయాలని కోరారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయని, వాటిని పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి పూర్తిస్థాయిలో సహకరించాలన్నారు. కార్యక్రమంలో మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, ఎంపీలు బలరాంనాయక్, వేంనరేందర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, రఘువీరారెడ్డి, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, వినోద్, సత్యం, శంకర్‌నాయక్, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
మళ్లీ ఇందిరమ్మ రాజ్యమే
మదన్‌మోహన్ ద్వారా కేసీఆర్‌కు రాజకీయ భిక్ష
వైద్యకళాశాలకు మదన్‌మోహన్ పేరు
సిద్దిపేట సభలో సీఎం రేవంత్‌రెడ్డి
లాంఛనంగా ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం
ఈ పథకంతో పేద కుటుంబాలకు భద్రత: టీపీసీసీ అధ్యక్షుడు


