టూరిజం అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్‌ | - | Sakshi
Sakshi News home page

టూరిజం అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్‌

Nov 20 2026 7:33 AM | Updated on Nov 20 2026 7:33 AM

కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

మెదక్‌ కలెక్టరేట్‌: మెదక్‌ టూరిజం అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ తెలిపారు. గురువారం టూరిజం కార్పొరేషన్‌ సభ్యులు శ్రియారెడ్డి, యాదగిరి మెదక్‌ పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌తో సమావేశమయ్యారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై డీపీఆర్‌ రూ పొందించిన తీరుతెన్నులు వివరించారు. టూరిజం అభివృద్ధి భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించిన వివరాలను సుదీర్ఘంగా చర్చించారు. పర్యాటక శోభ ఉట్టిపడేలా తుది మెరుగులు దిద్దుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీపీఆర్‌ఓ రామచంద్రరాజు, ఈడీఎం సందీప్‌, గైడ్‌ సంతోశ్‌ తదితరులు పాల్గొన్నారు.

నెలాఖరు వరకు అభ్యంతరాల స్వీకరణ

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్‌ను సవరించినట్లు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ తెలిపారు. ప్రజలకు మరింత అవకాశం కల్పించేందుకు క్లెయిమ్స్‌, అభ్యంతరాల దాఖలు గడువును ఈనెల 30వ తేదీ వరకు పొడిగించినట్లు వెల్లడించారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు జాబితాలో పేరు నమోదు, మార్పులు, తొలగింపులు, సవరణలు, చిరునామా మార్పు వంటి దరఖాస్తులను నిర్ణీత గడువులోగా సమర్పించాలని సూచించారు. ఇప్పటికే నోటీసులు అందుకున్న అనామలీస్‌, నో మ్యాపింగ్‌ ఓటర్లు తప్పనిసరిగా తమ వివరాలను సరిచేసుకోవాలని కోరారు. ఎస్‌ఐఆర్‌–2026 కార్యక్రమ పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువు లోగా అన్ని ప్రక్రియలను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. తుది ఓటరు జాబితాను డిసెంబర్‌ 22న విడుదల చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు నమోదు చేసుకోవాలని ప్రజలకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement