నర్సాపూర్: సిద్దిపేటలో జరిగిన సీఎం రేవంత్రెడ్డి సభకు నర్సాపూర్ డిపో నుంచి 28 బస్సులు కేటాయించారు. మిగిలిన 14 బస్సులను ఆయా మార్గాల్లో నడిపారు. నర్సాపూర్ నుంచి సంగారెడ్డి, బాలానగర్ తదితర మార్గాల్లో బస్సులు తక్కువగా తిరగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఆయా మార్గాల్లో వచ్చిన బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసి వెళ్లాయి. దీంతో చాలా మంది ప్రైవేట్ వాహనాలపై ఆధారపడ్డారు. ఈవిషయమై డిపో మేనేజర్ రాంమోహన్ వద్ద ప్రస్తావించగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే సీఎం సభకు తమ డిపో నుంచి కొన్ని బస్సులు కేటాయించినట్లు చెప్పారు.


