బాధ్యత పెద్దది.. భత్యం చిన్నది | - | Sakshi
Sakshi News home page

బాధ్యత పెద్దది.. భత్యం చిన్నది

Oct 24 2026 9:14 AM | Updated on Oct 24 2026 9:14 AM

మెదక్‌ కలెక్టరేట్‌: ఏళ్ల తరబడి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలందిస్తున్న తమను వెంటనే రెగ్యులరైజ్‌ చేయాలంటూ జిల్లాలోని జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ధర్నా చౌక్‌ వద్ద గత 11 రోజులుగా రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు కనీస వేతనాలు ఇవ్వకుండా పనిభారం పెంచుతూ వెట్టి చాకిరి చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ఇంక్రిమెంట్లు, ప్రసూతి సెలవులు, టీఏ, డీఏలు ఇవ్వడం లేదని వాపోతున్నారు. ప్రజలందరి ఆరోగ్య సమస్యలు పరిష్కరించే తమకు ప్రభుత్వం హెల్త్‌కార్డులు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. కరోనా సమయంలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలందిస్తే ఇప్పటికీ ఉద్యోగ భద్రత లేదని, మా జీవితాలు గాలిలో దీపంలా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఎన్‌హెచ్‌ఎం విభాగంలో 403 ఉద్యోగులు, సిబ్బంది పని చేస్తున్నారు. ఇందులో 110 మంది డాక్టర్లు, 26 మంది ఈసీ ఏఎన్‌ఎంలు, 267 మంది ఏఎన్‌ఎంలు, ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తున్నారు.

డిమాండ్లు ఇవే..

● ఔట్‌సోర్సింగ్‌ ఏజేన్సీలను రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ ప్రకారం వందశాతం వేతనం ఇవ్వాలి.

● పీహెచ్‌ఎస్‌, ఈఎస్‌ఐ కల్పించాలి. ప్రతీ నెల 5వ తేదీలోగా ప్రభుత్వం ద్వారా నేరుగా వేతనాలు చెల్లించాలి.

● 8 శాతం ఇంక్రిమెంట్లు, బోనస్‌లు ఇవ్వాలి. ప్రతి మహిళా ఉద్యోగికి 108 రోజులు ప్రసూతి సెలవులు ప్రకటించాలి.

● ప్రమాదవశాత్తు ఉద్యోగి మరణిస్తే రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలి.

● జీవో నంబర్‌ 60 ప్రకారం తక్షణమే వేతన బకాయిలు విడుదల చేయాలి.

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల ఆవేదన

చాలీచాలని వేతనంతో సతమతం

ఉద్యోగ భద్రత, కనీస వేతనం అమలు చేయాలని విన్నపం

జిల్లాలో 452 మంది ఉద్యోగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement