అభివృద్ధిలో ఆందోల్‌ అగ్రగామి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధిలో ఆందోల్‌ అగ్రగామి

Oct 24 2026 9:14 AM | Updated on Oct 24 2026 9:14 AM

● రూ.3 వేల కోట్లకు పైగా నిధులతో పనులు

● మంత్రి దామోదర రాజనర్సింహ

సంగారెడ్డి: ఆందోల్‌ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం చౌటుకూరు మండలం తాడ్దాన్‌పల్లిలో నిర్వహించిన అలయ్‌ బలయ్‌ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో రూ.3 వేల కోట్లకు పైగా నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. రహదారులు, ఆస్పత్రులు, నర్సింగ్‌ కళాశాల, వసతి గృహాలు, యంగ్‌ ఇండియా సమగ్ర పాఠశాల, కేజీబీవీ విద్యాలయాల నిర్మాణం, పాఠశాల భవనాలు, అదనపు తరగతి గదుల ఏర్పాటు వంటి పనులకు ప్రాధాన్యమిస్తున్నట్లు వివరించారు. సంక్షేమ వసతి గృహాల అభివృద్ధితో పాటు ఆందోల్‌ క్రీడా ప్రాంగణం, గిరిజన న్యాయ కళాశాల నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. జోగిపేట, ఆందోల్‌ పట్టణాలను అనుసంధానించే వంతెనలు, సింగూరు ప్రాజెక్టు వెను క జలాల పరిసర గ్రామాల్లో అంతర్గత రహదారు లు, రవాణ, పర్యాటక రంగాల అభివృద్ధికి చర్య లు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అలయ్‌ బలయ్‌ తెలంగాణ సంస్కతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ రెడ్డి, ప్రదేశ్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు సంగమేశ్వర్‌, ఇతర నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement