మెదక్ కలెక్టరేట్: జాతీయ ఆయుష్ మిషన్‌లో జిల్లాలో వివిధ పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయుష్ మెడికల్ ఆఫీసర్ 3, ఫార్మసిస్ట్ 1, సైకో–సోషల్ కౌన్సిలర్ 1, యోగా ప్రొఫెషనల్ 1, మల్టీ పర్పస్ వర్కర్ 2 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. అభ్యర్థులు 18 నుంచి 44 సంవత్సరాల వయసు ఉండాలన్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈనెల 26 నుంచి 31 తేదీలోపు జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
తూప్రాన్: నిర్మల్‌లో జరిగే 12వ రాష్ట్రస్థాయి జూనియర్ బాలికల సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే జిల్లా బాలికల జట్టు ఎంపిక ఈనెల 25న మనోహరాబాద్‌లోని తెలంగాణ క్రీడా ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణగుప్తా తెలిపారు. 2009 జనవరి తర్వాత జన్మించిన క్రీడాకారులు అర్హులన్నారు. క్రీడాకారులు తమ జనన ధ్రువపత్రాలు ఆధార్‌కార్డ్‌తో ఈ నెల 25న ఉదయం 10 గంటలకు హాజరుకావాలన్నారు. పూర్తి వివరాలకు జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్యాంసుందర శర్మ (7702445543) నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పదో తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజును ఎలాంటి అపరాధ రుసుము లేకుండా నవంబర్ 16వ తేదీ వరకు చెల్లించాలని డీఈఓ రాజు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మార్చి– 2027లో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపునకు ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటన చేసినట్లు తెలిపారు. రూ.50 అపరాధ రుసుముతో డిసెంబర్ 1వ తేదీలోగా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రూ.200తో డిసెంబర్ 14 వరకు, రూ.500 ఆఖరి అవకాశంగా 28 వరకు చెల్లించవచ్చని వెల్లడించారు.
హవేళిఘణాపూర్(మెదక్): ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారి జ్ఞానేశ్‌కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి మల్లేశం మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్ పేరుతో ఓట్ల దొంగతనం జరుగుతుందని, తొలగించిన ఓట్లను కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దివ్యాంగుల సంఘం జిల్లా నాయకులు దుర్గా, కవిత, అశోక్, శంకర్, రాములు పాల్గొన్నారు.
చిన్నశంకరంపేట(మెదక్): భూ రీ సర్వేను వేగవంతం చేయాలని మెదక్ ఆర్డీఓ రమాదేవి సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం మండలంలోని కాస్లాపూర్‌లో నిర్వహిస్తున్న సర్వేను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు గ్రామంలో 220 ఎకరాలు రీ సర్వే చేసినట్లు తెలిపారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిర్వహిస్తున్న రీ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ మాలతి, ఆర్‌ఐ, జీపీఓ, సర్వేయర్లు పాల్గొన్నారు.


