ఎల్‌నినోను ఎదుర్కొందాం | - | Sakshi
Sakshi News home page

ఎల్‌నినోను ఎదుర్కొందాం

Oct 24 2026 9:14 AM | Updated on Oct 24 2026 9:14 AM

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లాలో ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అన్నిశాఖల అధికారులు ప్రణాళికలతో సిద్ధం కావాలని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు, నీటి వనరుల సంరక్షణ, వర్షపు నీటి నిల్వ, భూగర్భజలాల పెంపు, ప్రజలకు అవగాహన కల్పించడం వంటి అంశాలపై సమగ్ర ప్రణాళికలు తయారు చేయాలన్నారు. గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీల వారీగా స్థానిక పరిస్థితులను అంచనా వేసి, అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు. ప్రతి గ్రామంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. నీటి వనరుల సంరక్షణ, చెరువులు, కుంటల్లో నీటి నిల్వ సామర్థ్యం పెంపు, వర్షపు నీటి సంరక్షణ, నీటి వృథాను అరికట్టడం వంటి చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ నగేశ్‌, డీఆర్‌ఓ అంబదాస్‌ రాజేశ్వర్‌, డీఎఫ్‌ఓ జోజి, డీపీఓ యాదయ్య, డీఆర్‌డీఓ పీడీ శ్రీనివాస్‌ రావు, వ్యవసాయ శాఖ అధికారి దేవ్‌కుమార్‌, ఉద్యాన అధికారి ప్రతాప్‌సింగ్‌, డీఈఓ రాజు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

నీటిని పొదుపుగా వాడుకోవాలి

నర్సాపూర్‌ రూరల్‌: ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో భూగర్భజలాలు అడుగంటి, నీటి సమస్య తలెత్తనున్నందున ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ ప్రజలకు సూచించారు. శుక్రవారం మండలంలోని చిన్నచింతకుంటలో పంట పొలాలతో పాటు గ్రామంలో పర్యటించి ఎల్‌నినోపై అవగాహన కల్పించారు. రైతులు రబీ సీజన్‌లో జాగ్రత్తలు పాటించి, తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. వర్షాకాలంలో ఎండిన పంటలపై రైతులు కలెక్టర్‌తో మొరపెట్టుకున్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి దేవ్‌కుమార్‌, ఉద్యాన అధికారి ప్రతాప్‌, సర్పంచ్‌ సరిత, ఎంపీడీఓ భారతి, ఏఓ దీపిక, మహేశ్‌గౌడ్‌, ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement