ఆయుధాలపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

ఆయుధాలపై అవగాహన అవసరం

Oct 24 2026 9:14 AM | Updated on Oct 24 2026 9:14 AM

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓపెన్‌ హౌస్‌ను ఎస్పీ శ్రీనివాసరావు శుక్రవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్‌శాఖ విధులు, నేరాల నియంత్రణపై అవగాహన కల్పించేందుకు ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు బాంబ్‌ డిస్పోజల్‌ (బీడీ) బృందం వినియోగించే పరికరాలు, అనుమానాస్పద పేలుడు పదార్థాలను గుర్తించడం, ప్రమాదాలను నివారించడంలో వాటి పాత్రను అధికారులు వివరించారు. నేర పరిశోధనలో నిందితుల ఆచూకీ గుర్తించడం, పేలుడు పదార్థాలను గుర్తించడం వంటి విధుల్లో శిక్షణ పొందిన పోలీసు జాగిలాలు అందించే సేవలను తెలియజేశారు. సైబర్‌ నేరాలు, పోక్సో చట్టం, బాలల హక్కులు, సోషల్‌ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ విక్రాంత్‌కుమార్‌సింగ్‌, మెదక్‌ డీఎస్పీ ప్రసన్న కుమార్‌, పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

ఎస్పీ శ్రీనివాసరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement