యాభై ఏళ్ల కింద ఆ భూములను సర్కార్ ఇచ్చింది. అప్పటి నుంచి పంటలు పండించి బతుకుతున్నాం. వాటిని సర్కారోళ్లు మావంటే మేము ఎలా బతకాలి? మా ఊరికి ఆ భూములే బతుకుదెరువు.
– రంగి వెంకయ్య, కొండాపూర్
మాకు భూములతోపాటు అప్పడే పట్టాలిచ్చారు. వాటిని బ్యాంకుల్లో పెట్టి అప్పు తీసుకున్నాం. బోర్లు వేశాం. అప్పటి నుంచి పంటలు పండిస్తున్నాం. కానీ సర్వేలు చేసి ఏం రాకుండా చేశారు.
– దప్పు భూమయ్య, కొండాపూర్
కొండాపూర్‌లో దశాబ్దాల క్రితం ఆ ఊరి ప్రజలకు 500 ఎకరాల భూములను అప్పట్లో ఇచ్చారు. కాగా, 2017లో చేసిన భూ సర్వేలో వాటిలో కొంత ఫారెస్టు పరిధిలోకి వచ్చాయని తేలటంతో వాటిని పార్ట్(బీ)లో పెట్టారు. ప్రస్తుతం 22(ఏ)లో పొందుపర్చారు. కాగా, వాటిని రెవెన్యూ, ఫారెస్టు జాయింట్ సర్వే చేయాల్సి ఉంది.
– జోజి, డీఎఫ్‌ఓ, మెదక్


