రోస్టర్‌ పాయింట్‌ సవరించాలి | - | Sakshi
Sakshi News home page

రోస్టర్‌ పాయింట్‌ సవరించాలి

Sep 8 2026 7:15 AM | Updated on Sep 8 2026 7:15 AM

మెదక్‌ కలెక్టరేట్‌: మాలల రోస్టర్‌ పాయింట్‌లను సవరించాలని మాలల జేఏసీ జిల్లా చైర్మన్‌ సుధాకర్‌, కో చైర్మన్‌ కల్లూరు సంజీవ, ఎంసీఏ రాష్ట్ర కమిటీ సభ్యుడు శంకర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మాల కోఆర్డినేషన్‌ ఫోరం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మా ట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా హడావిడిగా ఎస్సీ వర్గీకరణ చేయడం వల్ల మాలలు విద్యా ఉద్యోగాల్లో తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్లలో మాలలకు ఒక్క ఉద్యోగం కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించి రోస్టర్‌ వల్ల జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. కార్యక్రమంలో మాలల జేఏసీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement