నర్సాపూర్: జాతీయస్థాయి రాక్‌బాల్ పోటీలు బీవీరాజు ఇంజనీరింగ్ కాలేజీలో ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. సోమవారం రెండో రోజు డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నియోజకవర్గ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆవుల రాజిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడల నిర్వహణ అభినందనీయమని మురళీయాదవ్‌ను అభినందించారు. అన ంతరం ఆయా రాష్ట్రాల క్రీడాకారులను పరిచ యం చేసుకున్నారు. రాక్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధులు పోటీలను పర్యవేక్షించారు. కాగా, వర్షంతో పోటీల నిర్వహణకు కొంత ఇబ్బందిగా మారింది.


