బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి
మెదక్‌జోన్: కాంగ్రెస్ సర్కార్ ప్రజాస్వామ్యంపై దాడి చేస్తూ ప్రతిపక్షాల గొంతునొక్కుతుందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో ప్రశ్నించేందుకు వెళ్తున్న బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులను అడ్డుకొని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ సోమవారం పట్టణంలోని బస్ డిపో ఎదుట రాస్తారోకో చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తే తప్పా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించడం సరికాదన్నారు. మహిళా ప్రజాప్రతినిధుల పట్ల గౌరవం లేకుండా వ్యవహరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. ప్రతిపక్ష నాయకుల అరెస్టులతో ప్రజల గొంతును నొక్కలేరన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా రాజకీయ కక్ష సాధింపు చర్యలను పక్కనపెట్టి ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలన్నారు. అంతకుముందు పట్టణంలో ఆటో కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ నేతలతో కలిసి కలెక్టరేట్‌కు వెళ్లి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌కు అందించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి, కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్‌న్ మల్లికార్జునన్‌గౌడ్, పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులుతో పాటు బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.


