వ్యాపార రంగంలో ఏ వస్తువైనా ఎమ్మార్పీ కంటే అధిక ధరకు అమ్మడం నేరం. కాని యూరియా బస్తాలు మాత్రం ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు సహకార సంఘాల్లో విక్రయిస్తున్నారు. ఇది నేరం కాదా..? ప్రభుత్వ శాఖలే ఇలా చేస్తే సామాన్యుల పరిస్థితి ఏమిటి. ఈవిషయమై ప్రభుత్వం పునరాలోచించుకోవాలి.
– నరసింహులు, రైతు, శివ్వాయపల్లి
ఎరువుల ధరలు తగ్గించాలి
యూరియా ధరలను అమాంతం పెంచి విక్రయిస్తుండటంతో తమపై అదనపు భారం పడుతుంది. ఇన్నాళ్లు రూ. 266కే లభ్యమైన బస్తా, నేడు రూ. 300 వరకు పెంచారు. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న రైతులపై అదనపు భారం మోపడం సరికాదు. ప్రభుత్వమే రవాణ చార్జీలు భరించాలి.
– రమేశ్, రైతు, దంతేపల్లి తండా


