తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ ఏర్పాటుకు వినతి | - | Sakshi
Sakshi News home page

తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ ఏర్పాటుకు వినతి

Aug 6 2026 8:02 AM | Updated on Aug 6 2026 8:02 AM

తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ ఏర్పాటుకు వినతి కిసాన్‌ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా లింగారెడ్డి 11వ మహాసభను జయప్రదం చేయండి యాప్‌ ఎర్రర్‌.. ఇంటికి వెళ్లరు

వెల్దుర్తి(తూప్రాన్‌): మండల కేంద్రం వెల్దుర్తిలోనే తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ ఏర్పాటు చేయాలని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు, యువకులు బుధవారం ఎమ్మెల్యే సునీతారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. మండల కేంద్రానికి దూరంగా కాకుండా స్థానికంగానే పాఠశాల ఏర్పాటు చేస్తే విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సునీతారెడ్డి వెల్దుర్తిలోనే తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ ఏర్పాటయ్యేలా తన వంతు కృషి చేస్తానని హామీనిచ్చారు. ప్రజల అవసరాలను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అనుకూల నిర్ణయం వచ్చేలా ప్రయత్నిస్తానని ఆమె తెలిపారు. ఎమ్మెల్యే హామీతో తల్లిదండ్రులు, యువకులు సంతృప్తి వ్యక్తం చేశారు.

చిన్నశంకరంపేట (మెదక్‌): బీజేపీ కిసాన్‌ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా నార్సింగి మండల కేంద్రానికి చెందిన యెన్నం లింగారెడ్డి నియామకం చేస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్‌, కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు బైండ్ల సత్యనారాయణ నియామకపత్రం అందించారు. ఈ సందర్భంగా లింగారెడ్డి మాట్లాడుతూ..తనపై నమ్మకంతో రెండవసారి జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించేందుకు సహకరించిన మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ బలోపేతం చేసేందుకు తనశాయశక్తుల కృషిచేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్‌, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సత్యపాల్‌రెడ్డి అభినందించారు.

తూప్రాన్‌: ఈ నెల ఆగస్టు 7న కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో జరిగే అఖిల భారత జాతీయ ఓబీసీ 11వ మహాసభను జయప్రదం చేయాలని జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు చిన్నలింగ్‌ మల్లికార్జున్‌గౌడ్‌ పేర్కొన్నారు. మహాసభకు సంబంధించిన వాల్‌ పోస్టర్స్‌ను ఆవిష్కరించారు. బీసీలు అధిక సంఖ్యలో పాల్గొ ని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీసీ నాయకులు బాయికాడి ఆంజనేయులు, నవీన్‌ పాల్గొన్నారు.

ఎఫ్‌ఆర్‌ఎస్‌ నమోదులో టీచర్ల తిప్పలు

పాపన్నపేట(మెదక్‌): ఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్‌ తప్పుల వల్ల.. బడి విడవగానే టీచర్లు ఇంటికి వెళ్లడంలో జాప్యం జరుగుతోంది. ఫొటో దిగుతున్నప్పుడు యాప్‌ మొండికేస్తుండటంతో నానా అవస్థలు పడాల్సి వస్తోందని పాపన్నపేట ఉన్నత పాఠశాల టీచర్లు వాపోతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతీరోజు ఉదయం, సాయంత్రం ఎఫ్‌ఆర్‌ఎస్‌లో అటెండెన్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే బుధవారం సాయంత్రం బడి ముగియగానే, ఎఫ్‌ఆర్‌ఎస్‌ నమోదు కోసం, ఫొటో దిగాలని ప్రయత్నిస్తే యాప్‌ కట్‌ అవుతుందని, ఇంకొందరికి టూమెనీ లాగిన్స్‌ అని, మరి కొందరికి సర్వర్‌ ఎర్రర్‌ అంటూ రావడంతో టీచర్లు అసహనానికి లోనయ్యారు. దీంతో కొంతమంది టీచర్లు ఫొటోలు దిగకుండానే ఇళ్లకు వెళ్లిపోయారు. అధికారులు స్పందించి సాఫ్ట్‌వేర్‌ సరిచేయాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement