మెదక్ కలెక్టరేట్: రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని అదనపు కలెక్టర్ నగేశ్ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా అన్ని వార్డుల్లో పర్యటించి రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. వైద్యుల అటెండెన్స్ రిజిస్టర్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిరుపేద రోగులు ఎన్నో అవస్థలతో ఆస్పత్రికి వస్తారని, వారికి మెరుగైన వైద్య సేవలు అందించి ఆదుకోవాలని సూచించారు. ఆపదలో వచ్చే రోగులను ఇబ్బందులకు గురిచేయవద్దన్నారు. ఆస్పత్రి పరిసరాల పరిశుభ్రం చేయడంతో పాటు రోగులకు కనీస వసతులు కల్పించాలన్నారు. నాణ్యమైన భోజనాన్ని అందించాలని వైద్యాధికారులకు సూచించారు. ఆయన వెంట రేడియాలజిస్ట్ శారదా దేవి, ఆర్‌ఎంఓ శైలజ, శ్రీవిద్య , ప్రియాంక, నిర్మల, వంశీతో పాటు సిబ్బంది ఉన్నారు.
రోడ్డు ప్రమాదాలను అరికడదాం
మెదక్ కలెక్టరేట్: రోడ్డు ప్రమాదాల నివారణలో హైవే వెంట ఉన్న హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యం కీలక భాగస్వాములు కావాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల సమయంలో గోల్డెన్ అవర్‌లో అందించే తక్షణ వైద్య సహాయం ప్రాణాలను కాపాడడంలో అత్యంత కీలకమని ఎస్పీ తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే 100, 112 లేదా 108కు సమాచారం అందించి క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించేలా హోటళ్ల యాజమాన్యం చొరవ తీసుకోవాలని సూచించారు. హోటల్ సిబ్బందికి ప్రథమ చికిత్స, సీపీఆర్‌పై అవగాహన కల్పించి, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేలా శిక్షణ ఇవ్వాలని కోరారు. జిల్లాలో సుమారు 255 కిలోమీటర్ల మేర ఏడు జాతీయ రహదారులు ఉన్నాయని తెలిపారు. మహిళల రక్షణ, మాదకద్రవ్యాలు, అక్రమ కార్యకలాపాలను అరికట్టడంలో పోలీసులకు సహకరించడం ద్వారా అనేక విలువైన ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు. అంతకు ముందు జిల్లాలో షీటీం ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి ఎస్పీ వివరించారు. సమావేశంలో అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్‌రెడ్డి, డీఎస్పీలు ప్రసన్న కుమార్, నరేందర్‌గౌడ్, హోటళ్ల యాజమానులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ నగేశ్
ఎస్పీ డీవీ శ్రీనివాస్‌రావు


