తూప్రాన్: ప్రాణాంతక ఐరన్ పరిశ్రమను తొలగించాలని మనోహరాబాద్ మండలంలోని రంగాయిపల్లి, చెట్ల గౌరారం గ్రామాల ప్రజలు డిమాండ్ చేశా రు. శుక్రవారం రంగాయిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పోస్టుకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి గజ్వేల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. ఐరన్ పరిశ్రమతో రెండు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. కాలుష్య ప్రభావంతో వ్యవసాయ భూములు దెబ్బతిని రైతులు నష్టపోతున్నారని, చెరువుల్లో చేపలు మృతి చెందు తున్నాయని ఆరోపించారు. అనంతరం కలెక్టర్ కు పోస్టు కార్డులపై ‘ మా ప్రాణాలను– మా పిల్లల భవిష్యత్తును కాపాడండి’ అని లేఖలో పేర్కొంటూ సుమారు వె య్యికి పైగా పోస్టుకార్డులను పంపించారు. కార్యక్రమంలో రేణుకుమార్, వెంకట్‌గౌడ్, అర్జున్, శ్రీనివాస్‌గౌడ్, నాగభూషణం, నాయకులు, యువకులు పాల్గొన్నారు.
పోస్టుకార్డులతో కలెక్టర్‌కు వినతుల వెల్లువ


