తక్షణమే మరమ్మతులు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

తక్షణమే మరమ్మతులు చేపట్టాలి

Aug 1 2026 7:46 AM | Updated on Aug 1 2026 7:46 AM

హవేళిఘణాపూర్‌(మెదక్‌): గతేడాది కురిసిన వర్షాలతో మెదక్‌ మండలం రాయిన్‌పల్లి ప్రాజెక్టు డిస్ట్రిబ్యూషన్‌ కెనాల్‌ పూర్తిగా దెబ్బతిందని, మరమ్మతులు చేపట్టకపోతే కూలిపోయే ప్రమాదం ఉందని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి అన్నారు. శుక్రవారం ప్రాజెక్టును పరిశీలించి మాట్లాడారు. నామమాత్రం పనులతో సరిపెట్టుకున్న అధికారులు శాశ్వత పనులు చేపట్టకపోవడం వల్ల చెరువు కింద సాగునీటికి ఆధారపడిన రైతులకు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం స్పందించి ప్రాజెక్టుకు శాశ్వత పనులు చేపట్టి రైతులకు మేలు జరిగే విధంగా చూడాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కిష్టయ్య, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ మల్లికార్జున్‌గౌడ్‌, న్యాయవాది జీవన్‌రావు, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గంగా నరేందర్‌, నాగులు, జంగం వీరస్వామి, మెదక్‌ మున్సిపల్‌ కౌన్సిలర్‌ మామిళ్ల ఆంజనేయులు, బాలయ్య, కిష్టయ్య, సిద్దిరాములు, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement