పెద్దశంకరంపేట(మెదక్): ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ గణేశ్వర్ వైద్య సిబ్బందికి సూచించారు. గురువారం పెద్దశంకరంపేట పీహెచ్‌సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వివిధ విభాగాలు, ఓపీ సేవలు, సబ్‌సెంటర్ల నిర్వహణ, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు, సిబ్బంది హాజరు శాతం, మందుల రికార్డులు పరిశీలించారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున ప్రజలు డెంగీ, మలేరియా, వైరల్ జ్వరాలు వంటి సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని, వాటి నివారణకు గ్రామాల వారీగా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు డ్రైడేపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం కేజీబీవీని సందర్శించి వంట గది, స్టోర్‌రూం, ఆహార నిల్వలను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. దీంతో పాటు ఓ ప్రైవేట్ ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఆయన వెంట జిల్లా మలేరియా అధికారి శ్రీ చందర్, జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ హరిప్రసాద్, ప్రోగ్రాం అధికారి డాక్టర్ నవ్య, వైద్యులు షరీఫొద్దీన్, సిబ్బంది యాదయ్య, వెంకటేశ్ తదితరులు ఉన్నారు.
డీఎంహెచ్‌ఓ గణేశ్వర్


