మెదక్ కలెక్టరేట్: జిల్లాలో కురుస్తున్న అధిక వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులంతా అందుబాటులో ఉండి సేవలందించాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచించారు. గురువారం కలెక్టర్ గూగుల్ మీట్ ద్వారా తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ప్రత్యేక అధికారులతో మాట్లాడారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ డీవీ శ్రీనివాసరావుతో కలిసి పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. వర్షాల నేపథ్యంలో అధికారులకు సెలవులు రద్దు చేసినట్లు తెలిపారు. ప్రజలకు అత్యవసర సమయంలో సేవలు అందించేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం (9391942254) ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగకూడదని, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను రక్షించేందుకు రోప్స్, డ్రోన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నా రు. అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వ హాస్టల్స్, అంగన్‌వాడీ సెంటర్లకు రూప్ లీకేజీ ఉన్నట్లయితే ప్రత్యా మ్నాయ చర్యలపై దృష్టి సారించాలన్నారు. ధూప్‌సింగ్ తండా ప్రజలకు రాకపోకలు ఇబ్బంది కలకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, అదనపు ఎస్పీ విక్రాంత్‌కుమార్‌సింగ్, డీఆర్‌ఓ అంబదాస్ రాజేశ్వర్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతిమాసింగ్
కంట్రోల్ రూమ్ ఏర్పాటు


