అన్ని వార్డుల్లో అభివృద్ధి జరగాలి | - | Sakshi
Sakshi News home page

అన్ని వార్డుల్లో అభివృద్ధి జరగాలి

Jul 31 2026 7:16 AM | Updated on Jul 31 2026 7:16 AM

మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు

మెదక్‌ కలెక్టరేట్‌: పట్టణంలోని అన్నివార్డుల ప్రజలు మున్సిపాలిటీకి పన్నులు చెల్లిస్తున్నారని, పార్టీలకతీతంగా అభివృద్ధి పనులు చేపట్టాలని బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు మున్సిపల్‌ కమిషనర్‌ దృష్టికి తీసుకొచ్చారు. గురువారం మెదక్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌ సాఽ దారణ సర్వసభ్య సమావేశం జరిగింది. చైర్‌పర్సన్‌ రాధిక అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు మాట్లాడుతూ.. తమ వార్డులలో ప్రజలు కూడా పన్ను చెల్లిస్తున్నారని, అభివృద్ధి పనులు ఎందుకు చేపట్టడం లేదని నిలదీశారు. వైస్‌ చైర్మన్‌ నరేష్‌గౌడ్‌ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రోహిత్‌రావుతో మాట్లాడి అన్ని వార్డుల్లో అభివృద్ధి పను లు చేపట్టేలా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతకుముందు చైర్‌పర్సన్‌ రాధిక మాట్లా డుతూ.. ఎనిమల్‌ బర్త్‌ కంట్రోల్‌తో పట్టణంలో కుక్కల నివారణ చేపడుతున్నట్లు చెప్పారు. అలాగే ప్రస్తుత వర్షాకాలంలో ప్రజలు ఇబ్బంది పడకుండా మురికి కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ నవీన్‌తో పాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement