శిక్షణతో మహిళలకు ఆర్థిక భరోసా | - | Sakshi
Sakshi News home page

శిక్షణతో మహిళలకు ఆర్థిక భరోసా

Jul 31 2026 7:16 AM | Updated on Jul 31 2026 7:16 AM

కొల్చారం(నర్సాపూర్‌): స్వయం ఉపాధి కింద శిక్షణలో నేర్చుకున్న కళా ఖండాలను ప్రదర్శనకు ఉంచి ఆర్థికంగా ఎదగాలని అదనపు డీఆర్డీఓ సరస్వతి సూచించారు. మండలంలోని చిన్నఘనపురం గ్రా మంలో మహిళా సమాఖ్య సభ్యులకు తంజావూర్‌ పెయింటింగ్‌పై 20 రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గురువారం నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ పొందిన మహిళలకు ధ్రువ పత్రాలను అందజేశారు. అనంతరం మహిళలు రూపొందించిన పెయింటింగ్‌ ప్రదర్శనను సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఈ శిక్షణ కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. తంజావూర్‌ పెయింటింగ్‌ను మరింత నాణ్యతగా తయారుచేసి ప్రభుత్వ కార్యక్రమాల్లో జ్ఞాపికలుగా అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మధుసూదన్‌ రెడ్డి, నాబార్డ్‌ ఏబీఎం కృష్ణ తేజ, మండల సమాఖ్య సిబ్బంది యాదగిరి, వెంకటేశం, విజయ తదితరులు పాల్గొన్నారు.

అదనపు డీఆర్డీఓ సరస్వతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement