వ్యాయామ విద్య అవసరం | - | Sakshi
Sakshi News home page

వ్యాయామ విద్య అవసరం

Jul 31 2026 7:16 AM | Updated on Jul 31 2026 7:16 AM

వ్యాయామ విద్య అవసరం కూలిన పాఠశాల గోడ సమస్యలపై ఉద్యమిద్దాం

హవేళిఘణాపూర్‌(మెదక్‌): విద్యార్థులకు మానసిక వికాసం, వ్యాయామ విద్య ఎంతో కీలకమని జిల్లా యువజన క్రీడల అధికారి రమేశ్‌ అన్నారు. గురువారం మండల కేంద్రంలో వ్యాయామ ఉపాధ్యాయులకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి క్రీడలకు అత్యంత ప్రా ధాన్యతనిస్తూ జాతీయ స్థాయి ఖేల్‌ క్రీడలను రాష్ట్రంలో నిర్వహించడం గర్వకారణమన్నారు. విద్యలో వస్తున్న సాంకేతిక పరిజ్ఞానం కూడా క్రీడా నైపుణ్యాభివృద్ధి, విషయ పరిజ్ఞా నాన్ని తెలుకునేందుకు వీలుంటుందని అన్నారు. సమావేశంలో జిల్లా రిసోర్స్‌ పర్సన్స్‌ నరేశ్‌, రవి, దేవానంద్‌, శ్వేతాకుమారి, శ్రీనివాస రావు, మధుసూదన్‌, శ్రీధర్‌రెడ్డి, మధు, చంద్రమోహన్‌, మాధవరెడ్డి పాల్గొన్నారు.

టేక్మాల్‌(మెదక్‌): గత నాలుగు రోజలుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని ఎక్లాస్‌పూర్‌ ప్రాథమిక పాఠశాల తరగతి గది వెనుక భాగం కూలిపోయింది. గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లిన ఉపాధ్యాయులు, విద్యార్థులు గమనించి పాఠశాలలో చదువుకునే పరిస్థితి లేకపోవడంతో లోకల్‌ సెలవు తీసుకున్నారు. రాత్రి సమయంలో గోడ కూలడంతో ప్రమాదం తప్పిందని, పాఠశాల సమయంలో కూలితే ప్రమాదం సంభవించేదని స్థానికులు వాపోయారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నూతన భవనం నిర్మించడం లేదని ఆవే దన వ్యక్తం చేశారు. తహసీల్దార్‌ తులసీరాం, ఎంపీడీఓ సత్యనారాయణ పాఠశాలను పరిశీలించారు. సమస్యను ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు.

చిన్నశంకరంపేట(మెదక్‌): ఉద్యోగ, ఉపాధ్యా య సమస్యలపై ఈనెల 1న ఇందిరాపార్క్‌ వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తపస్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చల్లా లక్ష్మణ్‌ తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్‌ స్కూల్‌ ఆవరణలో మహాధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 317 జీఓ బాధితులకు న్యాయం చేయాలని కోరారు. సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ అమలు చేయాలన్నారు. పెండింగ్‌ డీఏ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ధర్నాకు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తపస్‌ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మహేశ్‌, శ్రీహరి, శ్రీకాంత్‌రెడ్డి, లింగం, అంజనేయులు, నరేందర్‌, కవిత, చంద్రకాంత్‌, స్వప్న, నవీన్‌, చంద్రశేఖర్‌, మహేందర్‌ పాల్గొన్నారు.

గ్రామాల సమగ్రాభివృద్ధి

నారాయణఖేడ్‌: గ్రామాల సమగ్రాభివృద్ధే తమ లక్ష్యమని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. గురు వారం మండలంలోని గోప్యానాయక్‌ తండాలో రూ.20 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనం, రూ.15 లక్షలతో నిర్మించిన పాఠశాల ప్రహరీ, పలు తండాల్లో సీసీ రోడ్లను ప్రారంభించారు. అలాగే మండంలోని హంగర్గా(కె) నుంచి లాల్‌సింగ్‌ తండా వరకు నిర్మించనున్న ఫార్మేషన్‌ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. మౌలిక వసతుల కల్పన, విద్యాసంస్థల అభివృద్ధి, రహదారుల నిర్మాణం, పంచాయతీ వ్యవస్థ బలోపేతం కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఆత్మ చైర్మన్‌ వినోద్‌పాటిల్‌, బంజారా సేవాలాల్‌ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్‌ చౌహాన్‌, సర్పంచ్‌లు అనూషబాయి, మహాదేవి, శాంతకుమార్‌, ఉపసర్పంచ్‌ భాస్కర్‌, మనోహర్‌ పాటిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement