నిప్పుల కుంపటి | - | Sakshi
Sakshi News home page

నిప్పుల కుంపటి

Apr 12 2026 6:35 AM | Updated on Apr 12 2026 6:35 AM

మెదక్‌జోన్‌: మెతుకుసీమపై నిప్పుల వాన కురుస్తోంది. వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడు తన విశ్వరూపం చూపిస్తున్నాడు. సా యంత్రం వరకు ప్రజలు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లతో ఉపశమనం పొందుతున్నారు. వివిధ పనులపై జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజలు ఎండ నుంచి వేడిమికి తాళలేక తాత్కాలిక ఉపశమనం పొందేందుకు చల్లటి పానీయాలు, కూల్‌డ్రింక్‌లు, కొబ్బరినీళ్లు సేవిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని వైద్యులు చెబుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయట కు వస్తే గొడుగులు, చేతిరుమాలు తలపై కప్పుకోవాలని సూచిస్తున్నారు. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలంటున్నారు. కాగా మున్ముందు ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఐదు రోజుల ఉష్ణోగ్రతలు ఇలా..

తేదీ కనిష్ట గరిష్ట

7 22.3 39.9

8 18.4 39.8

9 19.9 39.3

10 20.1 40.6

11 20.9 41.4

జిల్లాలో 40 డిగ్రీలు దాటిన

ఉష్ణోగ్రతలు

ఉదయం 9 గంటల నుంచే

భానుడి విశ్వరూపం

ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement