మార్కెట్‌కు వస్తే కదా బాధ తెలిసేది | - | Sakshi
Sakshi News home page

మార్కెట్‌కు వస్తే కదా బాధ తెలిసేది

Apr 12 2026 6:35 AM | Updated on Apr 12 2026 6:35 AM

● మీరు రారు.. ప్రభుత్వం పట్టించుకోదు ● అధికారులపై హరీశ్‌రావు ఆగ్రహం ● రెండు రోజుల్లో రైతుల సమస్యలు పరిష్కరించాలి

● మీరు రారు.. ప్రభుత్వం పట్టించుకోదు ● అధికారులపై హరీశ్‌రావు ఆగ్రహం ● రెండు రోజుల్లో రైతుల సమస్యలు పరిష్కరించాలి

సిద్దిపేటజోన్‌: అధికారులు కొనుగోలు కేంద్రాలకు రారు.. ప్రభుత్వమూ పట్టించుకోదు.. మరి రైతుల బాధ తీర్చేదెవరు అంటూ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోళ్లలో జాప్యం.. రైతుల పడిగాపులు, పేరుకుపోయిన పొద్దుతిరుగుడు రాశులపై ఈనెల10న సాక్షిలో ‘కొంటారా... కొనరా’అనే శీర్షికపై ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. శనివారం సిద్దిపేట పత్తి మార్కెట్‌ యార్డును పరిశీలించారు. పొద్దుతిరుగుడు, మొక్కజొన్న రైతులతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంచులు, కోటా, లారీలు, హమాలీ సమస్యల పేరిట కొనుగోలు చేయడం లేదని రైతులు హరీశ్‌రావు దృషికి తీసుకొచ్చారు. స్పందించిన ఆయన వెంటనే జిల్లా మార్క్‌ఫెడ్‌ డీఎం సునీత, మార్కెట్‌ కమిటీ కార్యదర్శి వెంకటయ్యలకు ఫోన్‌ చేసి ఆగ్రహం వ్యక్తంచేశారు. యార్డులో రైతులు బాధ పడుతుంటే మీరేమి చేస్తున్నట్టు అని ఆగ్రహం వ్యక్తంచేశారు. మీరు మార్కెట్‌ యార్డుకు వస్తే కదా రైతుల బాధలు తెలిసేది అంటూ మండిపడ్డారు. కోటా పూర్తి అయిందని, లారీలు, హమాలీ సమస్య ఉందన్నారు. సోమవారం నాటికి మొక్కజొన్న, పొద్దుతిరుగుడు రైతుల సమస్యలను పరిష్కరించాలని, కొనుగోళ్లు వేగవంతం చేయాలని సూచించారు. యార్డులో ఐదు మిషన్లు ఉండగా.. రెండు మాత్రమే పని చేస్తున్నాయని, అవసరమైతే మరో రెండు మి షన్లు కొనుగోలు చేయాలన్నా రు. ఆయన వెంట మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రాజనర్సు. మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్లు వేణుగోపాల్‌ రెడ్డి, సాయిరాం, పట్టణ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు సంపత్‌, నాయకులు వరాల సురేష్‌, రెడ్డి ప్రభాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement