మెదక్‌జోన్: జిల్లా కాంగ్రెస్ కమిటీలో 61 మందికి చోటు కల్పిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ గురువారం జాబితా విడుదల చేశారు. డీసీసీ అధ్యక్ష స్థానానికి ప్రధానంగా నలుగురు పోటీపడగా ఆంజనేయులుగౌడ్‌ను రెండోసారి నియమించిన విషయం తెలిసిందే. కాగా జిల్లా కార్యవర్గంలో 61 మంది సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలకు చోటు కల్పించారు. అందులో 14 మంది వైస్ ప్రెసిడెంట్లు, 20 మంది జనరల్ సెక్రటరీలు, ఆరుగురు అధికార ప్రతినిధులు, 20 మంది సెక్రటరీలు, ఒకరిని ట్రెజరీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అధికార ప్రతినిధులుగా జె. నర్సింహచారి, శెట్టి శ్రీకాంత్, బండారి గంగాధర్, లూనావత్ రాణినాయక్, శ్రీనివాస్‌రావు, మహేశ్వరరెడ్డి, ట్రెజరీగా శివరామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులుగా మన్నె విజయభాస్కర్, నర్సింహారెడ్డి, గడప దేవేందర్, కొడకంటి హరిత, దేమ యాదగిరి, ప్రశాంత్‌రెడ్డి ఎరుకల నర్సింహా, శ్రీనివాస్‌రెడ్డి, ప్రవీణ్ కుమార్‌రెడ్డి, యాదగిరి, సిద్దిరాములు, నరేందర్‌రెడ్డి, అశోక్, పాషా, జనరల్ సెక్రటరీలుగా, అశోక్‌రెడ్డి, రాజేంద్ర పాటీల్, నవీన్ కుమార్, రాజాగౌడ్, ఎండీ అఫ్సర, శశిభూషణ్‌రెడ్డి, నర్సింగ్‌నాయక్, ప్రేమ్‌కుమార్, వినోద్‌కుమార్, విద్యాసాగర్, అమీరుద్దీన్, రమేష్, శేక్ సల్మాన్, కుమార్, రమేష్‌గౌడ్, గోపీనాయక్, శ్రవణ్‌కుమార్, మేఘమాల, సిద్దిరాములుగౌడ్, శేఖులుతో పాటు సెక్రటరీలుగా మరో 20 మందిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


