జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా భవాని | - | Sakshi
Sakshi News home page

జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా భవాని

Mar 17 2026 8:23 AM | Updated on Mar 17 2026 8:23 AM

జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా భవాని ఆయిల్‌పామ్‌ సాగుతో లాభాలు సఖీ, భరోసాతో మహిళలకు రక్షణ అన్ని వర్గాలను మోసం చేశారు

పెద్దశంకరంపేట(మెదక్‌): జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా మండల కేంద్రానికి చెందిన అవుసుల భవాని నియమితులయ్యారు. గతంలో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈక్రమంలో ఏఐసీసీ మహిళా అధ్యక్షురాలు అలకలాంబ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ పిలుపు మేరకు తిరిగి ఆమె హస్తం పార్టీలో చేరారు. ఈమేరకు సోమవారం గాంధీభవన్‌లో నియామకపత్రం అందుకున్నారు. తనను తిరిగి జిల్లా అధ్యక్షురాలిగా నియమించిన కాంగ్రెస్‌ నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.

చేగుంట(తూప్రాన్‌): రైతులు ఆయిల్‌పామ్‌ పంటలు వేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్‌ సూచించారు. సోమవారం మండలంలోని పెద్దశివునూర్‌లో ఆయిల్‌పాం పంటలు పరిశీలించి రైతులతో మాట్లాడారు. నీటి సౌకర్యం తక్కువగా ఉన్న పొలాల్లో ఆయిల్‌పాం వేసుకోవాలన్నారు. ఒకసారి పంట వేసుకుంటే నాలుగో సంవత్సరం నుంచి 25 ఏళ్ల వరకు దిగుబడి వస్తుందని తెలిపారు. కోతుల బెడద లేకుండా ఉండటంతో పాటు అంతర పంటలు వేసుకుంటే ప్రభుత్వం పెట్టుబడి సాయం కోసం ఎకరాకు రూ.4 వేలు అందిస్తుందన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్‌, సర్పంచ్‌ సర్సింలు, వ్యవసాయ విస్తరణ అధికారి భువనేశ్వరీ తదితరులు పాల్గొన్నారు.

మెదక్‌జోన్‌: సఖీ, భరోసా సెంటర్లు మహిళలకు రక్షణగా నిలుస్తున్నాయని లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ చీఫ్‌ కరుణాకర్‌ తెలిపారు. సోమవారం పట్టణంలోని సఖీ, భరోసా కేంద్రాలతో పాటు బాలసదన్‌ చిల్డ్రన్‌ హోమ్‌ను సందర్శించారు. చిన్నారులతో మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో అడ్వకేట్‌ బాలనర్సింలు, సఖీ సిబ్బంది రేణుక, భరోసా సెంటర్‌ కోఆర్డినేటర్‌ సౌమ్య తదితరులు పాల్గొన్నారు.

రామాయంపేట(మెదక్‌): కాంగ్రెస్‌ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాగి రాములు, మండలాధ్యక్షుడు నవీన్‌గౌడ్‌, పట్టణశాఖ అధ్యక్షుడు శీలం అనివాశ్‌రెడ్డి, వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు పబ్బ సత్యం సోమవారం మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని, ఈప్రభుత్వం అన్నివర్గాల ప్రజలను మోసగించిందని ఆరోపించారు. అంతకుమందు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆర్‌ఐకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అక్కన్నపేట సర్పంచ్‌ యాదగిరి, పార్టీ జిల్లా నాయకులు రాజేంద్రప్రసాద్‌, చింతల శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement