తూప్రాన్/పాపన్నపేట(మెదక్)/నర్సాపూర్/హవేళిఘణాపూర్: జిల్లాలోని పలు మండలాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. తూప్రాన్‌లో సోమవారం ఉదయం ఎండతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సాయంత్రం సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం దంచికొట్టింది. గుండ్రెడ్డిపల్లి– మల్కాపూర్ గ్రామానికి వెళ్లే రహదారిపై భారీ వృక్షం విరిగిపడింది. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. సర్పంచ్ ఆంజనేయులుగౌడ్ స్థానికుల సహాయంతో రహదారిపై అడ్డంగా ఉన్న వృక్షాన్ని తొలగించా రు. అలాగే పాపన్నపేట, హవేళిఘణాపూర్ నర్సాపూర్, కొల్చారం మండలాల్లోని పలు గ్రామాల్లో వడగళ్ల వాన కురిసింది.


