చిన్నశంకరంపేట(మెదక్): రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 24 గంటల విద్యుత్ సరాఫరా చేయాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని సూరారంలో ఆమె మాట్లాడుతూ.. పంటలకు విద్యుత్ సరిగా అందకపో వడంతో పంటలు ఎండిపోతున్నాయన్నారు. కనీసం 10 గంటలు కూడా అందించడం లేదని వా పోయారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించకుంటే రైతుల ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని హెచ్చరించారు. రైతుభరోసా డబ్బులు అందరికీ ఒకేసారి విడుదల చేయాలన్నారు. ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలన్నారు. ఆమె వెంట మాజీ జెడ్పీటీసీ పట్లోరి మాధవిరాజు, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రాజు, నాయకులు లక్ష్మారెడ్డి, మహిపాల్‌రెడ్డి, సర్పంచ్ సావిత్రి, నాగరాజు ఉన్నారు.


