ఆర్వో ప్లాంట్లు | - | Sakshi
Sakshi News home page

ఆర్వో ప్లాంట్లు

Mar 17 2026 8:23 AM | Updated on Mar 17 2026 8:23 AM

అంగన్‌వాడీలకు

జిల్లాలో మొదటి విడతగా 268 కేంద్రాలకు మంజూరు వచ్చే నెలాఖరులోగా బిగింపు

అంగన్‌వాడీ కేంద్రాల్లో సురక్షిత తాగు నీరు అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేస్తుంది. చిన్నారులు, గర్భిణులు కలుషిత నీటితో వ్యాధుల బారిన పడకుండా ఈ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు సాక్షం అంగన్‌వాడీ పోషణ్‌ 2.0 పథకం కింద నిధులు మంజూరు చేసింది. ఇందుకు గాను మొదటి విడతగా జిల్లాలో 268 కేంద్రాలను ఎంపిక చేసింది.

– రామాయంపేట(మెదక్‌)

జిల్లాలో ఇలా..

అంగన్‌వాడీ కేంద్రాలు 1,076

సొంత భవనాలు 369

ఆర్వో ప్లాంట్ల మంజూరు 268

కేంద్రాల్లో చిన్నారులు 54 వేల పైచిలుకు

జిల్లాకు మంజూరైన ఆర్వో ప్లాంట్లను ప్రాధాన్యత క్రమంలో సొంత భవనాలు, విద్యుత్‌ సదుపాయం ఉన్న కేంద్రాలను మొదటి విడతగా ఎంపిక చేశారు. తర్వాత మిగితా కేంద్రాలకు ప్లాంట్లు మంజూరవుతాయని సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో పాటు కేంద్రాలకు వచ్చే చిన్నారులకు పోషక విలువలున్న కూరగాయలు, ఆకుకూరలు పండించడానికి వీలుగా పోషణ్‌ వాటిక పథకం కింద కిచెన్‌ గార్డెన్లు నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement