కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలో గ్యాస్ కొరత గృహాలు, హోటళ్లకు తాకింది. దీంతో కట్టెల పొయ్యిపై వంటలు చేస్తున్నారు. హోటల్‌లో టిఫిన్ ధరలు అమాంతం పెంచారు. మండల కేంద్రంలోని కౌడిపల్లిలో గత వారం రోజులుగా గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. బుక్ చేసినా స్టాక్ లేక సిలిండర్ దొరకడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కాగా హోటల్ యజమానులు గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో కట్టెల పొయ్యిపై వంట చేస్తున్నారు. కాగా కౌడిపల్లిలో ఇన్నాళ్లు ప్లేట్ టిఫిన్ ధర రూ.30 ఉండగా, ప్రస్తుతం రూ. 40కు పెంచారు.
కౌడిపల్లి: హోటల్‌లో కట్టెల పొయ్యిపై
వంట చేస్తున్న నిర్వాహకులు


