కేంద్ర ప్రభుత్వ విధానాలపై పోరాటం: సీఐటీయూ | - | Sakshi
Sakshi News home page

కేంద్ర ప్రభుత్వ విధానాలపై పోరాటం: సీఐటీయూ

Jan 20 2026 10:17 AM | Updated on Jan 20 2026 10:17 AM

కేంద్

కేంద్ర ప్రభుత్వ విధానాలపై పోరాటం: సీఐటీయూ

మెదక్‌ కలెక్టరేట్‌: కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఐక్యంగా పోరాడాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు పిలుపునిచ్చారు. సోమవారం కార్మిక, కర్షక ఐక్యత దినోత్సవం సందర్భంగా మెదక్‌ పట్టణంలో బహిరంగ సభ నిర్వహించగా, ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్పొరేట్ల కోసం కేంద్రం కార్మికులు, రైతుల పొట్ట కొడుతుందని ఆరోపించారు. లేబర్‌కోడ్‌లు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. వీబీ జీ రామ్‌జీ పేరుతో ఉపాధి హామీ పేరు మార్చి కూలీలను మోసం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఫిబ్రవరి 12న కార్మిక వర్గం దేశవ్యాప్త సమ్మె చేపడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మల్లేశం, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బాగయ్య, నాయకులు గౌరయ్య, నాగేందర్‌రెడ్డి, సంతోశ్‌, నాగరాజు, బస్వరాజు, బాబు, కవిత, షౌకత్‌, సత్యం తదితరులు పాల్గొన్నారు.

బాల్య వివాహాలు

నిర్మూలించాలి

నర్సాపూర్‌ రూరల్‌: బాల్య వివాహాలను నిర్మూలించాలని నర్సాపూర్‌ జూనియర్‌ సివిల్‌ కోర్టు ఏజీపీ శ్రీధర్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో పాల్గొని మాట్లాడారు. బాల్య వివాహాలతో పాటు రోడ్డు భద్రత, మాదకద్రవ్యాలపై ప్రతి విద్యార్థికి అవగాహన అవసరమన్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. రోడ్డుపై వాహనాలు నడిపే వారు సీటుబెల్ట్‌, హెల్మెంట్‌ ధరించాలన్నారు. మద్యం, డ్రగ్స్‌కు బానిస కావొద్దని సూచించారు. కార్యక్రమంలో న్యాయవాది స్వరూపరాణి, మాజీ ఏజీపీ సుధాకర్‌, హెచ్‌ఎం జ్యోతి, శైలజ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

లబ్ధి పొందడానికే ఆరోపణలు

రామాయంపేట(మెదక్‌): మున్సిపాలిటీలో అ వినీతి ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌ ఆదేశాల మేరకు కాంగ్రెస్‌ నాయకులు సోమవారం కార్యాలయానికి వెళ్లి విచారించారు. ఈమేరకు మాజీ కౌన్సిలర్లు నాగరాజు, దేమె యాదగిరి, అనిల్‌కుమార్‌, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు చింతల స్వామి తదితరులు ము న్సిపల్‌ కమిషనర్‌తో సమావేశమై చర్చించారు. మున్సిపాలిటీకి వచ్చిన నిధులు, ఖర్చుల వివరాలు కమిషనర్‌ వారికి వివరించారు. తాము ఎలాంటి అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. మున్సిపల్‌ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్‌ఎస్‌ నాయకులు లబ్ధిపొందడానికే ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఈవిషయమై తాము ఎమ్మెల్యేకు వివరాలు అందజేస్తామని ప్రకటించారు.

చిరుత సంచారం

తూప్రాన్‌: మండలంలోని గుండ్రెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో బండరాళ్లపై రెండు చిరుతలు సంచరిస్తున్నట్లు సోమవారం గ్రామస్తులు గుర్తించారు. దీంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి సమయంలో వ్యవసాయ బావుల వద్దకు వెళ్తే దాడి చేస్తాయని భయాందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి బోన్లు ఏర్పాటుచేసి చిరుతలను పట్టుకెళ్లాలని కోరారు. కాగా గతంలో చాలాసార్లు ఇదే ప్రాంతంలో చిరుతలు కనిపించాయని, ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అటవీశాఖ అధికారులు మాత్రం చిరుతలు అటవీ ప్రాంతంలోనే సంచరిస్తామని, రైతులు ఒంటరిగా వెళ్లవద్దని సూచిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వ విధానాలపై  పోరాటం: సీఐటీయూ1
1/3

కేంద్ర ప్రభుత్వ విధానాలపై పోరాటం: సీఐటీయూ

కేంద్ర ప్రభుత్వ విధానాలపై  పోరాటం: సీఐటీయూ2
2/3

కేంద్ర ప్రభుత్వ విధానాలపై పోరాటం: సీఐటీయూ

కేంద్ర ప్రభుత్వ విధానాలపై  పోరాటం: సీఐటీయూ3
3/3

కేంద్ర ప్రభుత్వ విధానాలపై పోరాటం: సీఐటీయూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement