అయ్యప్ప ఆలయంలో పీసీసీ చీఫ్ పూజలు
నర్సాపూర్: నర్సాపూర్‌లో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం కొనసాగుతున్న శ్రీ ఆదిపరాశక్తి అయ్యప్పస్వామి ఆలయాన్ని మంగళవారం పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ సందర్శించి పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూజారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం యాగశాల వద్ద పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ అశోక్‌గౌడ్ ఆధ్వర్యంలో పూజారులు, అయ్యప్ప దీక్షాపరులు మహేశ్‌కుమార్‌గౌడ్‌తోపాటు డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, మదన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ ఆవుల రాజిరెడ్డిలను ఘనంగా సన్మానించారు.


